Asianet News TeluguAsianet News Telugu

రక్షాబంధన్ వేళ.. మైనర్ బాలిక మీద సామూహిక అత్యాచారం.. అన్నకు రాఖీ కట్టడానికి వెడుతుంటే కిడ్నాప్ చేసి...

రక్షా బంధన్‌ రోజున బీహార్‌లోని సివాన్‌లో ఓ మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అన్నకు రాఖీ కట్టడానికి వెడుతున్న బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 

Minor girl gang-raped on Raksha Bandhan day in Bihar
Author
Hyderabad, First Published Aug 15, 2022, 9:55 AM IST

బీహార్ : బీహార్ లో దారుణం జరిగింది. రక్షా బంధన్‌ రోజు జరగిన ఈ ఘోరం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రక్షాబంధన్ సందర్భంగా బీహార్‌లోని సివాన్‌లో ఓ మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అన్నకు రాఖీ కట్టడం కోసం బాలిక తన సోదరుడి ఇంటికి వెళ్తుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ దారుణానికి సంబంధించిన నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేయకపోవడంతో ఈ సంఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం, బాలిక తన సోదరుడికి రాఖీ కట్టేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు. వదిలిపెట్టమంటూ, రక్షించమంటూ బాలిక కేకలు వేస్తూనే ఉంది. అయినా నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, అటుగా కారులో వెడుతున్న ఓ వ్యక్తి ఆమె అరుపులు విని.. నేరం జరిగిన ప్రదేశానికి చేరుకునేసరికి నిందితులు పారిపోయాడు.

నీళ్ళ కుండ ముట్టుకున్నాడని.. తొమ్మిదేళ్ల దళిత బాలుడిని కొట్టి చంపిన టీచర్..

డ్రైవర్ బాలికకు సహాయం చేసి ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు, అక్కడ ఆమెకు చికిత్స జరుగుతోంది. ఈ ఘటనలో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. భగవాన్ పూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ పంకజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు బాలికకు వైద్యం అందించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు పవన్ కుమార్, అంకిత్ కుమార్, ఇమాముద్దీన్, దినేష్ కుమార్‌లపై శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాధితురాలు తన మేనమామ ఇంట్లో నివసిస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురై తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గ్రామంలో పరిస్థితులు సరిగా లేవని గ్రామస్తులు తెలిపారు. మద్యపాన నిషేధం తర్వాత యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 9న తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఓ జూనియర్ ఆర్టిస్టుపై అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. అప్పు కోసం వెళ్లిన జూనియర్ ఆర్టిస్ట్పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఇందిరా నగర్లో నివసించే యువతి (22) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గత ఆదివారం మధ్యాహ్నం తనకు డబ్బులు అవసరమై బాలు నాయక్ అనే యువకుడిని అడిగింది. 

అతను ఆమె అడిగిన డబ్బులు ఇస్తానని.. లోపలికి రమ్మని పిలిచాడు. అతడిని నమ్మి లోపలికి వెళ్లిన ఆమెను బాలునాయక్ ఒక గదిలో బంధించాడు. ఆ తరువాత ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.  అంతేకాదు అక్కడే ఉన్నస్నేహితుడితో కూడా గడిపితే రూ.5వేలు ఇస్తానంటూ షరతు విధించాడు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఇద్దరు వెళ్లి అడిగేందుకు ప్రయత్నించగా.. అప్పటికే నిందితుడు గదికి తాళం వేసి ఉడాయించాడు.. బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios