దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికపై లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలోని మానవ మృగాలు కామంతో కళ్లుమూసుకుపోయిన ప్రవర్తిస్తున్నారు.

దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికపై లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలోని మానవ మృగాలు కామంతో కళ్లుమూసుకుపోయిన ప్రవర్తిస్తున్నారు. తాజాగా కదులుతున్న కారులో 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అస్సాంలోని కోక్రాజార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం తెలిపారు. మంగళవారం సాయంత్రం జాతీయ రహదారి 31సీ పై నలుగురు యువకులు బాలికను బలవంతంగా వాహనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. 

బాలికపై అత్యాచారం జరిగిన ప్రాంతంలో డోట్మా పట్టణానికి సమీపంలో ఉందని చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసుల రంగంలోకి దిగారని చెప్పారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారని తెలిపారు. బుధవారం సాయంత్రం నలుగురు నిందితులను పట్టుకోవడం జరిగిందని చెప్పారు. నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు.. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, 2012 (పోక్సో) కింద డోట్మా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడిందని వెల్లడించారు. 

నిందితులను కోక్రాఝర్‌లోని కోర్టు ముందు హాజరుపరిచినట్టుగా పోలీసులు తెలిపారు. న్యాయమూర్తి వారికి మూడు రోజుల పోలీసు రిమాండ్ విధించినట్టుగా చెప్పారు.