Asianet News TeluguAsianet News Telugu

తల్లి ముందే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఇద్దరి అరెస్ట్...

జార్ఖండ్ లో ఓ మైనర్ బాలిక మీద ఆమె తల్లి కళ్లెదుటే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు. తల్లి ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. 

Minor Girl Gang-Raped In Front Of Her Mother In Jharkhand
Author
First Published Oct 11, 2022, 11:28 AM IST

జార్ఖండ్‌ : జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ఆమె తల్లి ముందే ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు సోమవారం తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయాన్ని పరిశీలించేందుకు డియోఘర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారని అధికారి తెలిపారు.

డుమ్కా జిల్లాకు చెందిన బాలిక, ఆమె తల్లి ఆదివారం డియోఘర్‌లోని ఒక కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా మధుపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సబ్-డివిజనల్ పోలీసు అధికారి బి రౌత్ ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ లో తెలిపారు. ఈ దారుణంపై ఆమె తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ప్రకారం, రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు వారిద్దరినీ దారిలో అటకాయించారు. ఆ తరువాత ఆమె కుమార్తెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు.

మధ్యప్రదేశ్ లో పరువు హత్య !?.. పట్టపగలు, నడిరోడ్డుపై మైనర్ల గొంతుకోసి హత్య...!!

తల్లి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆమెను కొట్టి, ఆ తర్వాత తన ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో తల్లి పేర్కొన్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నామని దేవఘర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సుభాష్ చంద్ర జట్ తెలిపారు. నిందితులను గుర్తించిన పోలీసులు మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 1న బీహార్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మధుబని జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆ బాలికను విక్రయించారు. ఈ కేసులో ఒక మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఆ తరువాత ఓ మహిళా పింప్‌కు రూ.50,000లకు అమ్మేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌజిల్లాకు చెందిన బృందం సోనీదేవి అనే మహిళా పింప్ చెర నుంచి బాలికను రక్షించి కేసును చేధించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అరెస్టయిన వారిని జైనగర్‌లోని అశోక్ మార్కెట్‌లో నైట్‌గార్డు సోనీ దేవి, అర్జున్ యాదవ్, ఎలక్ట్రీషియన్ సాజన్ కుమార్‌గా గుర్తించారు.
జైనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆచార్య..పోలీసు డ్రైవర్, రామ్‌జీవన్ పాశ్వాన్ అనే చోకీదార్ పరారీలో ఉన్నారు. బాధితురాలు నెల రోజుల క్రితం తన సొంత ఊరు మౌ నుండి దారితప్పి మధుబని జిల్లా జైనగర్ పట్టణానికి చేరుకుంది. అశోక్ మార్కెట్‌లో ఒంటరిగా తిరుగుతుంటే ఆమెకు అర్జున్ యాదవ్ కనిపించాడు. ఆమె అతని సహాయం కోరింది. ఆమె ఒంటరిగా ఉందని గమనించిన అతను ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. తన ముగ్గురు స్నేహితులకు సమాచారం ఇచ్చి పిలిపించాడు. వారు నలుగురూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ఒక గదిలో బందీగా ఉంచారు.

అలా వారు ఆమె మీద పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. మిగతా తమకు తెలిసిన వారిని కూడా పిలిచి ఆమె మీద అత్యాచారం చేయించారు. కాగా, బాధితురాలు ఇంట్లో కనిపించకపోవడంతో మౌలోని పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మౌ పోలీసుల బృందం మధుబని జైనగర్ పట్టణానికి చేరుకుంది. అనుమానంతో సోనీ దేవి ఇంటిపై దాడి చేసింది. అక్కడ ఆ బాలిక  ప్రాణాలతో బయటపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios