ఉత్తరప్రదేశ్ లో వరుస దారుణాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో రోజుకో చోట మహిళల మీద హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా యూపీలోని బరేలీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై బాయ్ ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి, అశ్లీల వీడియో తీసిన దారుణ ఘటన జరిగింది. 

మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాయ్ ఫ్రెండ్ ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

జనవరి 1వతేదీన తన బాయ్ ఫ్రెండుతో పాటు అతని నలుగురు స్నేహితులు తమ కుమార్తెపై అత్యాచారం చేశారు. అంతేకాకుండా అశ్లీల ఫొటోలు, వీడియోను చిత్రీకరించి దాన్ని ఆన్ లైనులో ఉంచారని బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

బాలిక అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో  వెలుగుచూడటంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, బాయ్  ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితులను పట్టకునేందుకు యత్నిస్తున్నామని బరేలీ ఏఎస్పీ సత్యానారాయణ ప్రజాపత్ చెప్పారు.