Asianet News TeluguAsianet News Telugu

బాలింతకు సాయం కోసం వెడితే.. 13యేళ్ల బాలికపై యజమాని బంధువు లైంగిక దాడి, హత్య.. !

సోదరుడి భార్య ప్రసవించడం తో సాయం చేయడానికి అంటూ మా యజమానురాలు నా కుమార్తెను జూలై 17న గుర్ గావ్ కు పంపారు. నా కుమార్తె చనిపోయిందంటూ ఆగస్టు 23 వ తేదీ మధ్యాహ్నం మా యజమాని నాకు ఫోన్ చేసి చెప్పారు. 

Minor girl from delhi raped, killed in gurgaon, landlord s relative arrested
Author
Hyderabad, First Published Sep 1, 2021, 10:46 AM IST

ఢిల్లీలో నరేలా ప్రాంతానికి చెందిన దళిత బాలిక (13)పొరుగునే ఉన్న గుర్ గావ్ లో అత్యాచారం, హత్యకు గురైంది. ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తమ కుమార్తె దహనసంస్కారాలు వెంటనే పూర్తి చేయాలంటూ యజమాని బంధువు తమపై ఒత్తిడి తెస్తున్నారు అంటూ మృతురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యింది.

‘సోదరుడి భార్య ప్రసవించడం తో సాయం చేయడానికి అంటూ మా యజమానురాలు నా కుమార్తెను జూలై 17న గుర్ గావ్ కు పంపారు. నా కుమార్తె చనిపోయిందంటూ ఆగస్టు 23 వ తేదీ మధ్యాహ్నం మా యజమాని నాకు ఫోన్ చేసి చెప్పారు.  రాత్రి 7గంటల సమయంలో మృతదేహాన్ని మా ఇంటికి తీసుకువచ్చారు.  వెంటనే దహన సంస్కారాలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేశారు’ అని తండ్రి పోలీసులకు తెలిపారు.  యజమానురాలి సోదరుడు  ప్రవీణ్  వర్మ,  ఇతరులు కలిసి  తన కుమార్తెను చంపారని ఆయన ఆరోపించారు.

ఈ మేరకు స్పందించిన పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు. హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో  గుర్ గావ్ పోలీసులు వివిధ సెక్షన్లతోపాటు ఎస్‌సీ/ఎస్‌టీ చట్టం కింద కేసులు నమోదు చేసి,  ప్రవీణ్ ను అరెస్టు చేశారు.  కాగా, ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని లోక్ సభలో కాంగ్రెస్ నేత ఆధిర్‌ రంజన్‌ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన హోంమంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల దళిత బాలిక అత్యాచారం హత్యకు గురైన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios