ఆ చిన్నారి వయసు ఏడేళ్లు. కనీసం మంచేదో.. చెడేదో తెలుసుకునేంత వయసు కూడా కాదు. చాక్లెట్స్ తింటూ.. బొమ్మలతో ఆడుకునే ఆ పసిదానితో.. 16కామాంధులు కామక్రీడ ఆడారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 16మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గులంతా ఆ చిన్నారి బంధువులు కావడం అత్యంత పాశవికం. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. అయితే... ఈ ఘటన జరిగి రెండు సంవత్సరాలు కాగా... అప్పటి నుంచి ప్రాణాలతో పోరాడుతూ ఆ చిన్నారి తాజాగా తనువు చాలించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  తమిళనాడు రాష్ట్రం విల్లుపురం మండలం బ్రహ్మదేశం ప్రాంతానికి చెందిన మహిళకు పెళ్లై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే... ఆమె తన ఇద్దరు కుమార్తెలను తన తల్లి వద్ద ఉంచి... భర్తతో కలిసి పుదుచ్చేరిలో ఉండేది. భార్య, భర్త ఇద్దరూ అక్కడ పలుచోట్ల పనిచేస్తూ.. కుమార్తెలను చదివిస్తున్నారు. వాళ్లిద్దరూ పనుల మీద వెళితే పిల్లల పోషణకు ఇబ్బంది అవుతుందని ఆమె వాళ్లని అమ్మమ్మ ఇంట్లో ఉంచింది. 

Also Read మీరట్ లో ఎంబీఏ విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్ రేప్...

అయితే... అమ్మమ్మగారి ఇంటి వద్ద పెరుగుతున్న పెద్ద కుమార్తె(10), చిన్న కుమార్తె(7)లపై బంధువులు కన్నేశారు. విడతల వారిగా ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు అక్కాచెల్లెళ్లపై 16మంది ఘాతుకానికి పాల్పడ్డారు.

ఈ విషయం ఆ పిల్లల తల్లికి ఆలస్యంగా తెలిసింది. అప్పటికే చిన్నకుమార్తె అస్వస్థతకు గురైంది. అప్పటి నుంచి అనారోగ్యానికి గురైన సదరు మైనర్ బాలిక రెండు సంవత్సరాలుగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్ద కుమార్తె తమకు జరిగిన అన్యాయాన్ని తమ స్కూల్లో తెలియజేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

 స్కూల్ టీచర్లు  చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. పోలీసులు 16 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బంధువుల బెదిరింపులు ఎక్కువ కావడంతో ఆమె.. భర్త, పిల్లలతో సహా పుదుచ్చేరి నుంచి చెన్నై శివారులోని పోరూరు చేరుకున్నట్టు తెలిసింది. కాగా.... కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.