దేశంలో మరో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. బిహార్‌లో కదులుతున్న బస్సులో మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

దేశంలో మరో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. బిహార్‌లో కదులుతున్న బస్సులో మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలు.. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగరంలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న బాలిక వద్దకు నిందితులు వెళ్లారు. బస్సు పాట్నాకు వెళ్తుందని బాలికను నమ్మించారు. ఆమె బస్సు ఎక్కిన తర్వాత.. దానిని బైపాస్ రోడ్డువైకు పోనిచ్చారు. అయితే బాలికకు మత్తుపదార్థాలు కలిపిన పానీయాన్ని ఇవ్వడంతో.. ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత నిందితులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. 

అనంతరం బాలికను బస్సులోనే ఉంచిన నిందితులు లాక్ చేసి పరారయ్యారు. కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాలిక.. బస్సులో నుంచి బయటకు రాలేకపోయింది. దీంతో బస్సు తలపులను కొట్టింది. బస్సులో నుంచి శబ్దం రావడంతో అటుగా వెళ్తున్నవారు గమనించి అక్కడికి వెళ్లి డోర్ ఓపెన్ చూశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. ఆమె మైనర్ అని పోలీసులు నిర్దారించారు. 

పాట్నాకు బస్సు ఎక్కిన సమయంలో ముగ్గురు వ్యక్తులు తనకు మత్తు పదార్థాలు శీతల పానీయం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత బాలిక వెల్లడించింది. బస్సులోని డ్రైవర్, కండక్టర్, మరో వ్యక్తి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. బాలిక ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. పోలీసులు వెంటనే బస్సును సీజ్ చేసి డ్రైవర్‌, కండక్టర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 2012లో దేశం మొత్తాన్ని కదిలించిన భయంకరమైన నిర్భయ కేసును ప్రజలకు గుర్తుచేసింది. 

ఇక, ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిందితులు అమ్నేషియా పబ్ నుంచి బాలికను తీసుకెళ్లి కారులో అత్యాచారం జరిపారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా.. వీరిలో సాదుద్దీన్ ఒక్కడే మేజర్. మిగిలిన ఐదుగురు కూడా మైనర్లే. వీరిలో సాదుద్దీన్‌తో పాటు నలుగురు మైనర్లపై సామూహిక అత్యాచారం (376 డీ), పోక్సో చట్టం, కిడ్నాప్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరో మైనర్‌పై పోక్సో, లైంగిక వేధింపుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు బాలికపై అత్యాచారం జరపలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.