Bengal: పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ పై లైంగిక దాడి జరగడంతో.. తీవ్ర రక్తస్రావమై.. ఆదివారం నాడు ప్రాణాలు కోల్పోయింది. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు శవపరీక్షలు చేయకుండానే దహన సంస్కరాలు నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Minor dies after alleged rape : మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా దేశంలోని ఏదో ఒక చోట నిత్యం వారిపై దాడులు, హింస, అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బర్త్ డే పార్టీకి వెళ్లిన ఓ మైనర్ పై పలువురు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఆదివారం నాడు ప్రాణాలు కోల్పోయింది. శపరీక్షలు నిర్వహించాల్సిన అధికారులు.. స్థానిక అధికార పార్టీ నేతలతో కలిసి... శవపరీక్షలు నిర్వహించకుండానే దహన సంస్కారాలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన పంచాయితీ సభ్యుని కుమారుడు సహా పలువురు నిందితులు కలిసి ఆదివారం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన 14 ఏళ్ల మైనర్ బాలిక మరణించింది. తమ కుమార్తెపై స్థానిక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడు, అతని సహచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక కుటుంబం ఆరోపించింది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితులపై కేసు నమోదుచేసి.. అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రజ్‌గోపాల్ గోలా.. స్థానిక గ్రామ పంచాయతీకి చెందిన టీఎంసీ సభ్యుడు సమర్ గోలా కుమారుడు. 9వ తరగతి చదువుతున్న ఈ మైనర్ బర్త్ డే పార్టీ కోసం స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెపై అక్కడ సామూహిక లైంగికదాడి జరిగింది. “నా కూతురు విపరీతంగా రక్తస్రావం అయింది. ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఆమె పార్టీ నుండి తిరిగి వచ్చిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి గురించి వెల్లడించింది. మేము ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే, ఆమె మరణించింది. ఆమె వేధింపులకు గురైనట్లు ఆయన నివాసంలో ఉన్నవారు అంగీకరించారు. నిందితులు మరియు అతని స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఖచ్చితంగా తెలుసు” అని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, లైంగికదాడికి గురైన బాలిక మృతదేహాన్ని హడావుడిగా & బలవంతంగా దహనం చేయడం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. మైనర్ బాలిక మరణ ధృవీకరణ పత్రం ఇవ్వకముందే ఆమె మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లారని ఆరోపించింది. స్థానిక పోలీసులు, అధికార పార్టీ నేతలు నేరం నుంచి తప్పించుకోవడానికి ఇలా చేశారని ఆరోపించారు. ఈ ఘటన గురించి బెంగాల్ మహిళా & శిశు అభివృద్ధి మంత్రి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు మరియు మైనర్‌లపై వేధింపులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహించేదని అన్నారు. ‘‘ఈ ఘటనపై ఎలాంటి రాజకీయాలు ఉండకూడదు. పోలీసులు విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటారు”అని ఆమె చెప్పారు.
ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. అధికార పార్టీ టీఎంసీ నేత కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ అత్యాచారానికి సంబంధించి కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ పిటిషనర్‌కు పిఐఎల్‌ను దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రేపు విచారణ జరిగే అవకాశాలున్నాయి.
