Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : తల్లి తాగే ’టీ‘లో విషం కలిపిన కూతురు.. మందలించిందని ప్రియుడితో కలిసి దారుణం..

తల్లి తాగే టీలో విషం కలిపి ఇచ్చిందో టీనేజ్ కూతురు. ఓ యువకుడితో తనకున్న రిలేషన్ తల్లికి తెలిసి మందలించిందని ఈ దారుణానికి తెగించింది. 

Minor Daughter poisoned in mothers tea over love affair in uttar pradesh - bsb
Author
First Published Oct 9, 2023, 1:28 PM IST

ఉత్తర ప్రదేశ్ : కన్నతల్లికే టీలో విషం కలిపి ఇచ్చింది ఓ కూతురు. షాకింగ్ గా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలిలో వెలుగు చూసింది.  ఓ యువకుడితో రిలేషన్షిప్ లో ఉన్న కూతురిని తల్లి మందలించింది.  ఇది నచ్చని కూతురు ఏకంగా తల్లినే అడ్డు తొలగించుకోవాలనుకుంది.  ఆమె తాగే ఛాయ్ లో విషం కలిపి ఇచ్చింది. అది తెలియని తల్లి ఆ టీ తాగడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైంది. కోలుకున్న తర్వాత అసలు విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…

ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలిలో ఓ టీనేజ్ అమ్మాయితో ఓ యువకుడితో రిలేషన్షిప్ లో ఉంది. ఈ విషయం తల్లికి తెలిసింది. దీంతో ఆమె కూతురిని మందలించింది. తల్లి మందలించడంతో కూతురికి విపరీతమైన కోపం వచ్చింది.. తల్లిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఆమె తాగే టీలో విషం కలిపింది. ఈ విషయం వెలుగు చూడడంతో పోలీసులు మైనర్ బాలికను  అరెస్టు చేసి, జువనైల్ హోమ్ కు తరలించారు. ఆమెను ఆ పని చేయడానికి ప్రేరేపించిన యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

దారుణం.. ఏడేళ్ల బాలికపై లైంగికవేధింపులు.. అడ్డుచెప్పిందని.. ఊపిరాడకుండా చేసి..

రాయబరేలీలోని గోండ్వారా గ్రామంలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అక్టోబర్ 5వ తేదీన 48 ఏళ్ల సంగీత అనే మహిళ తన కూతురు ఇచ్చిన టీ తాగిన తర్వాత తీవ్ర అనారోగ్యం పాలయ్యింది.  దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది సంగీత.  వెంటనే కూతురి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తన కూతురు హిమాంస్ యాదవ్ అనే 18 ఏళ్ల యువకుడితో చనువుగా ఉంటుందని.. కూతురిని ఇంకా టీనేజ్ కావడంతో తాను మందలించానని చెప్పుకొచ్చింది. అది నచ్చని హిమాంస్ యాదవ్, తన కూతురు ఇద్దరు కలిసి తనను వారి దారికి అడ్డుతొలగించుకోవాలని పథకం వేశారని తెలిపింది. ఇందులో భాగంగానే హిమాంస్ యాదవ్ తన కుమార్తె సహాయంతో తాను తీసుకునే ఆహార పదార్థాలలో ఏవేవో మత్తు మందులు కలిపి ఇచ్చాడని ఆరోపించింది.

అంతేకాదు, ఆమె తన ఫిర్యాదులో హిమాంస్ యాదవ్ తన కుటుంబాన్ని చంపుతానని కూడా బెదిరించినట్లు తెలిపింది. అయితే, సంగీత కుమార్తె పైన, హిమాంస్ యాదవ్ పైన ఐపిసి సెక్షన్ 328 కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. తినే పదార్థాలలో విషయం కలిపి ఇచ్చి హత్య  లేదా హాని చేసేందుకు ప్రయత్నించినందుకు పెట్టే సెక్షన్ ఇదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ జేపీ సింగ్ తెలిపారు. ఈ ఇద్దరినీ  అరెస్టు చేసి  అమ్మాయి ఇంకా మైనర్ కావడంతో జువ్వనైల్ హోమ్ కు, హిమాంస్ యాదవ్ ను శనివారం నాడు  జైలుకు  పంపినట్లు జేపీసింగ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios