Asianet News TeluguAsianet News Telugu

పక్కింటి పిల్లాడే కదా అని ఫోన్ ఇస్తే.. అశ్లీల చిత్రాలతో చుక్కలు చూపించి..

 అక్కడ నుంచి ఆమె పేరుతో ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్‌చేయడం వంటి చర్యలతో ఆమెను మానసికంగా చిత్రహింసకు గురిచేశాడు

Minor boy harassed medical student with messages
Author
Hyderabad, First Published Apr 8, 2021, 9:00 AM IST

ఆమె ఓ మెడికల్ విద్యార్థిని. ఆమె ఇంటి పక్కన 9వ తరగతి చదివే ఓ పిల్లాడు ఉన్నాడు. అక్కా అని పిలుస్తూ.. తరచూ ఇంటికి వచ్చేవాడు. చిన్న పిల్లాడే కదా అని అడిగిన ప్రతిసారీ ఫోన్ ఇచ్చేది. అదే ఆమె చేసిన తప్పు అయిపోయింది. ఆ పిల్లాడు.. ఆమె ఫోన్ లో పాస్ వర్డ్ మార్చి.. అక్కడ నుంచి ఆమె పేరుతో ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్‌చేయడం వంటి చర్యలతో ఆమెను మానసికంగా చిత్రహింసకు గురిచేశాడు. 

ఈ విషయం తెలియని ఆ యువతి.. తన ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయంటూ వాపోవడం గమనార్హం. కాగా.. చివరకు వేధింపులు తట్టుకోలేక యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఇతరుల ఫోన్‌లు తీసుకొని వారి మెయిల్స్‌ ఓపెన్‌ చేయడం, పాస్‌వర్డులు మార్చడం, తర్వాత వేరే సిస్టంలో మెయిల్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర మెసేజ్‌లు పంపడం తనకు అలవాటు అని చెప్పాడు. దీంతో బాలుణ్ని పోలీసులు జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. కాగా.. తనతో స్నేహంగా ఉన్న పక్కింటి బాలుడే ఇలాంటి నీచమైన పనికి పాల్పడ్డాడని తెలియడంతో ఆ యువతి తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది.

Follow Us:
Download App:
  • android
  • ios