గాంధీనగర్: ఓ మైనర్ బాలుడు తన తల్లి ప్రియుడిని అత్యంత దారుణంగా పథకం ప్రకారం హత్య చేశాడు. తల్లి చేసిన పనికి 17 ఏళ్ల కుర్రాడు హంతకుడిగా మారాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన బాలుడి తల్లి కొన్నేల్ల క్రితం ప్రియుడితో కలిసి పారిపోయింది. కొద్ది రోజుల తర్వాత అతని నిజస్వరూపం బయటపడింది. 

ఆమెతో ప్రియుడు గొడవపడుతూ అడ్డు వచ్చిన కుర్రాడిని కొడుతూ వచ్చాడు. ప్రతి రోజూ ఇద్దరిని చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. దాంతో అతను తల్లి ప్రియుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. మే 17వ తేదీన బైక్ మీద అతన్ని నిందితుడు నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపాడు. వరుసగా కత్తితో పొడుస్తూ వచ్చాడు. 

అతను చనిపోయాడని ధ్రువీకరించుకున్న తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

దర్యాప్తులో మైనర్ బాలుడి పేరు వెలుగులోకి వచ్చింది. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను తన నేరం అంగీకరించాడు. ప్రతి రోజు అతను తననూ తన తల్లినీ చిత్రహింసలకు గురిచేసేవాడని, అందుకే చంపేశానని చెప్పాడు.