ఎన్నికలు అంటే ఎంతో హడావుడి, సభలు,సమావేశాలు, ఎత్తులు, పైఎత్తులు బోలెడన్ని హామీలు, ప్రసంగాలు ,హంగులు ఆర్భాటాలు. ఇలా ఎన్నికల సమయంలో జరిగే  విషయాలు చాలానే విషయాలు ఉంటాయి. మిత్రులు శత్రువులుగా మారడం, శత్రువులు మిత్రులుగా మారుతుండడం జరుగుతుంటుంది.  ప్రచార సభల్లో అత్యుత్సాహంతో చేసే ప్రసగం అభ్యర్థులకు చిక్కులను తెచ్చిపెడుతుంటుంది. తాజాగా మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ట్రాపిక్‌  ఉల్లంఘనలు తగ్గించాలని తాజాగా కేంద్ర ఫ్రభుత్వం నూతన  ట్రాఫిక్ చట్టాన్ని తీసుకవచ్చింది. దాన్ని పాటించాలని ప్రభుత్వం చెబుతూ ఉంటే మంత్రి గారు మాత్రం రూల్స్... గిల్స్.. జాన్తానై అంటూ వాటికే ఎసరు పెట్టేశారు.  మహరాష్ట్ర  ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రచారం నిర్వహించనున్నారు. ఈ  సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.  మోదీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మంత్రి పరిణయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘించైనా సరే సభకు రావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

" సభకు వచ్చే వారు ఎలాంటి ఆందోళన చెందవద్దు . అవసరమైతే బైక్‌లపై ముగ్గురు ఎక్కిరండి. కావలనుకుంటే  ఐదుగురు కూడా రండి. ఎవరైనా  మిమ్మల్ని అడ్డుకోవాలని నాకు చెప్పండి" అంటూ  వివాదాస్పద వాఖ్యలు చేశారు మంత్రి పరిణయ్‌. ఈ  వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో శివసేన నేత కిశోర్‌ తివారీ స్పందించారు. మంత్రి వాఖ్యలను తప్పుపట్టారు. ఆయన కామెంట్స్  తీవ్రంగా పరిగణించాల్సినవి అంటూ మండిపడ్డారు.