తనకు  ఓ మంత్రి అభ్యంతరకర మేసేజ్‌‌లను పంపుతున్నారని   లేడీ ఐఎఎస్ అధికారిణి  పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు


చంఢీఘడ్: తనకు ఓ మంత్రి అభ్యంతరకర మేసేజ్‌‌లను పంపుతున్నారని లేడీ ఐఎఎస్ అధికారిణి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మంత్రిపై చర్యలు తీసుకొనేందుకు సీఎం రంగం సిద్దం చేసుకొంటున్నారని తెలుస్తోంది.

పంజాబ్ లో విధులు నిర్వహిస్తున్న ఐఎఎస్ అదికారిణి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు తనకు మంత్రి పంపిన అసభ్యకర మేసేజ్‌లను కూడ ముఖ్యమంత్రికి పంపారని సమాచారం.

అసభ్యమేసేజ్‌లు పంపడంపై ఐఎఎస్ అధికారిణి మంత్రికి ఇదివరకే వార్నింగ్ ఇచ్చినా కూడ తన ధోరణిని మార్చుకోలేదు.దీంతో ఆమె సీఎంకు ఫిర్యాదు చేసింది.అంతేకాదు ఈ విషయం ఎఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ దృష్టికి కూడ వెళ్లినట్టు సమాచారం.