Asianet News TeluguAsianet News Telugu

నవజోత్ సింగ్ సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు

ముస్లింలంతా ఏకమై కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్‌ అభ్యర్ధి తారిఖ్‌ అన్వర్‌ను గెలిపించుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశంలో జరుగుతున్న కుట్రలను ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలని కోరారు. జనాభాలో 54 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలు వలసలు పోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. 
 
minister navjotsingh sidhu sensational comments
Author
Chandigarh, First Published Apr 16, 2019, 6:21 PM IST

చండీగఢ్‌ : పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బీహార్ లోని కతిహార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్దూ ముస్లింలంతా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలంటూ పిలుపునిచ్చారు. 

ముస్లింలంతా ఏకమై కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్‌ అభ్యర్ధి తారిఖ్‌ అన్వర్‌ను గెలిపించుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశంలో జరుగుతున్న కుట్రలను ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలని కోరారు. జనాభాలో 54 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలు వలసలు పోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. 

పనుల కోసం పంజాబ్ కు వచ్చే ప్రతీ ముస్లిం సోదరుడికి సిద్ధూ అండగా ఉంటాడని హామీ ఇచ్చారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థులను నిలబెట్టకపోవడం వెనుక బీజేపీకి లబ్ధి చేకూరాలనే కుట్ర దాగి ఉందన్నారు. ఎన్నికల్లో సిక్స్‌ను బాది మోదీని బౌండరీ వెలుపలకు నెట్టివేయాలని పిలుపు ఇచ్చారు. 

ముస్లింలంతా ఏకమైతే  కాంగ్రెస్ అభ్యర్థి తారిఖ్‌ అన్వర్‌ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇప్పటికే ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న నేతలపై ఈసీ కొరడాలు ఝలిపిస్తుంటే తాజాగా నవజోత్ సింగ్ సిద్ధూ ముస్లింల గురించి నేరుగా మాట్లాడటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ముస్లింలపై యూపీ మాజీ సీఎం మాయావతి చేసిన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసింది. మరి సిద్ధూ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios