Asianet News TeluguAsianet News Telugu

Minister Jagadish Reddy: ముందస్తు ఎన్నికలపై మంత్రి జగదీష్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు .. వట్టి భ్రమేనని,   రాష్ట్రంలో ముందస్తూ ..వెనకస్తూ ఎన్నిక‌లు ఉంద‌వ‌ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ముందస్తూ అంటూ మాజీ పీసీసీ కలలు కంటున్నారని,  ఆ కలలు అన్ని పగటి కలలు గా ఉంటాయని  ఎద్దేవా చేశారు. 
 

Minister Jagadish Reddy Clarity on Early Elections
Author
Hyderabad, First Published Jan 22, 2022, 2:23 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు .. వట్టి భ్రమేనని,   రాష్ట్రంలో ముందస్తూ ..వెనకస్తూ ఎన్నిక‌లు ఉంద‌వ‌ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ముందస్తూ అంటూ మాజీ పీసీసీ కలలు కంటున్నారని,  ఆ కలలు అన్ని పగటి కలలు గా ఉంటాయని  ఎద్దేవా చేశారు. 

శనివారం సూర్యపేట జిల్లా కేంద్రం ప‌ర్య‌టించిన ఆయ‌న  మహిళా, శిశు,దివ్వాంగులు, వయో వృద్ధుల శాఖా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా  మూడు చక్రాల స్క్యూటి లు,ట్రై సైకిల్లు,లాప్ టాప్ లతో పాటు 4జి ఫోన్ లను ఆయన అంద జేశారు. అనంతరం మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దివ్వాంగులకు అండగా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. 

వికలాంగుల తొలుత‌ రూ. 1500 రూపాయల ఫించన్ అందిస్తున్నామ‌ని, రెండో సారి అధికారంలోకి రాగానే వారి ఫించన్ ను రూ.  3000 లకు పెంచిన ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

దివ్యాంగుల‌కు ఆసరాగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. అంగ వైకల్యతను అధిగమించి మిగితా వారితో పోటీగా అన్ని రంగాలలో వారిని పోటీ పడేలా మానసికంగా సిద్ధపరచడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. అటువంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఉందా అని ఆయన కాంగ్రెస్,బిజెపి లను సూటిగా ప్రశ్నించారు. 


ప్రధానికి ముందు ఏకధాటిగా 25 ఏండ్లు గుజరాత్ కు సీఎం గా ఉన్నారు, కానీ ఆయ‌న ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయ‌లేద‌ని అన్నారు.మోడీ ఎలుబడిలో ఎలాంటి సంక్షేమం ఉండదు.. ఆయ‌న  ఎలుబ‌డిలో ఎలాంటి అభివృద్ధి జరుగదని ఎద్దేవా చేశారు. ఓ వేళ అభివృద్ధి జరిగితే..  ఒకరిద్దరు దళారులకు మాత్రమే ఆ ఫలితం దక్కిందన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ కు బీజేపీ 100 మైళ్ళ దూరంలో ఉందన్నారు. అది అందుకోవడం ముమ్మాటికీ గగనకుసుమమేనన్నారు. 25 ఏండ్ల పాలనలో గుజరాత్ లో ఇంటింటికి మంచినీరు అందించలేని,  వారు  దేశాన్ని ఏమైనా అభివృద్ధి చేస్తారా అని నిలదీశారు.


అభివృద్ధి మీద చర్చ కు బిజెపి సిద్ధం అనుకుంటే..  అది ఢిల్లీ అయినా, గాంధీ నగ‌ర్ కైనా తమ పార్టీ కార్యకర్తలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ ,రైతుభీమా,రైతుబంధు వంటి పథకాలు దేశంలోని కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు పేరుతో 14 నుండి 15 వేల కోట్ల రూపాయలు రైతాంగానికి పెట్టుబడుల రూపంలో అందిస్తున్నామని అన్నారు.  

అలాగే రైతు బీమా కోసం సీఎం కేసీఆర్ సాలీనా 3000 కోట్ల ప్రీమియం చెల్లిస్తోంద‌ని తెలిపారు.  సహజ మరణాలకు కుడా భీమా వర్తించేలా రైతుభీమా పెట్టింది నిజం కాదా అని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు పీడిత ప్రాంతంగా మార్చిన ఘనత ముమ్మాటికి కాంగ్రెస్ దేనని, అంతే గాకుండా రెండు లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడేందుకు కారణం కుడా ఆ పార్టీదే నన్నారు.

అటువంటి పాపాలనుమూట కట్టుకున్న  కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే జిల్లా ప్రజలు పాతర పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 స్థానాలలో జెండా ఎగరేసేది టి ఆర్ య పార్టీ యోనన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు పెరిగిన విశ్వసనీయత కు నాగార్జున సాగర్, హుజుర్నగర్ ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios