Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ ను పిచ్చాస్పత్రిలో చేర్పించాలి:కేంద్రమంత్రి చౌబే

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే నిప్పులు చెరిగారు. రాహుల్ మనోవైకల్యంతో బాధపడుతున్నారని అతనిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో రాహుల్‌ పదే పదే మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 

Minister Choubey Calls Rahul Gandhi Schizophrenic, Sewer Worm
Author
Patna, First Published Sep 2, 2018, 1:52 PM IST

పట్నా: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే నిప్పులు చెరిగారు. రాహుల్ మనోవైకల్యంతో బాధపడుతున్నారని అతనిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో రాహుల్‌ పదే పదే మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ప్రధాని మోదీ ఆకాశంలాంటి వారైతే, రాహుల్‌గాంధీ ఓ చిన్న పురుగుతో సమానమన్నారు. రాహుల్ గొప్ప తెలివైన వ్యక్తి అనుకుంటాడని చమత్కరించారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో రాహుల్ అన్ని అబద్ధాలే చెబుతున్నారని మనోవైకల్యంతో బాధపడే వ్యక్తులే ఇలా మాట్లాడతారన్నారు. అతడిని మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పిస్తే బాగుంటుంది అని చౌబే వ్యాఖ్యలు చేశారు. 
కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి తల్లి అంటూ ఘాటుగా విమర్శించారు. ఉమ్మడి ప్రతిపక్షాల కూటమిని మహాఘట్‌బంధన్‌ అనుకుంటున్నారు, కానీ అది అవినీతి కూటమి అని ఎద్దేవా చేశారు. దేశానికి ప్రధాని మోదీ లాంటి వ్యక్తి ఎంతో అవసరం అన్న చౌబే వచ్చే ఎన్నికల్లో దేశమంతా ఏకమై మళ్లీ మోదీనే ప్రధానిగా ఎన్నుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే రాహుల్‌పై కేంద్రమంత్రి చౌబే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. 2015లో రాహుల్‌ బీజేపీపై విమర్శలు చేసినప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. రాహుల్‌ను చిలుకతో పోల్చారు. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ చదువుతారని విమర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios