కోల్‌కత్తా:తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, హీరోయిన్ మిమి చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్ ను కోల్‌కత్తా పోలీసులు అరెస్ట్ చేశారు.జిమ్ నుండి ఇంటికి వెళ్తున్న ఎంపీ కారును గరియాహట్ వద్ద ట్యాక్సీ డ్రైవర్ వెంబడించాడు. అంతేకాదు ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. 

ఈ విషయమై ఎంపీ మిమి చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కారు పక్కనే ట్యాక్సీ డ్రైవర్ తన కారును ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన కారును ఓవర్ టేక్ చేసి మరీ ఇలా చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంపీ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
ట్యాక్సీ డ్రైవర్ ను ఆనందపూర్ కు చెందిన లక్ష్మణ్ యాదవ్ గా గుర్తించారు. నిందితుడిపై ఐపీసీ 354, 354ఏ, 354డి, 509 కింద కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు.

ఈ ట్యాక్సీ డ్రైవర్ ను వదిలేయాలని తొలుత భావించాను. కానీ ఈ ట్యాక్సీలో ప్రయాణించే  మహిళా ప్రయాణీకులకు వేధింపులు తప్పకపోవచ్చని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మిమి చక్రవర్తి చెప్పారు.