Asianet News TeluguAsianet News Telugu

యూపీ ఎన్నికలు: సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపై ఎంఐఎం క్లారిటీ

యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను మజ్లీస్ కొట్టిపారేసింది. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదని తేల్చిచెప్పింది.

mim condemns the alliance with samajwadi party ksp
Author
Lucknow, First Published Jul 25, 2021, 4:51 PM IST

దేశానికి గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మరికొద్దినెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024కి సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీలతో పాటు సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు దృష్టిసారించాయి. వీటికి తోడు యూపీలోని చిన్నాచితకా పార్టీలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. అటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మజ్లస్ పార్టీ కూడా పోటీ చేసేందుకు రెడీ అవుతోంది.  ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. వార్తలను ఎంఐఎం కొట్టిపారేసింది. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదని తేల్చిచెప్పింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు సిద్ధమని వచ్చిన వార్తలను ఖండించింది.

ముస్లింను అఖిలేశ్ యాదవ్ ఉప ముఖ్యమంత్రిని చేస్తే సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని తాము ఎప్పుడూ చెప్పలేదని ఎంఐఎం యూపీ అధ్యక్షుడు షౌకత్ అలీ వివరణ ఇచ్చారు. తాను గానీ.. పార్టీ అధినేత అసదుద్దీన్ గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్ఫస్టం చేశారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 20 శాతం ముస్లిం ఓట్లు ఎస్పీకే పడ్డాయని మాత్రమే మేం చెప్పామని.. అన్ని ఓట్లు పడినా అధికారంలోకి వచ్చాక ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేయలేదని అన్నాం అని షౌకత్ అలీ స్పష్టం చేశారు.

మరోవైపు యూపీలోని వంద సీట్లలో పోటీ చేస్తామంటూ గతంలో అసదుద్దీన్ ప్రకటించారు. రాష్ట్రంలోని 110 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 30 నుంచి 39 శాతం దాకా ఉన్నారు. అందులోని 44 చోట్ల 40 నుంచి 49 శాతం ముస్లిం ఓటర్లున్నారు. 11 స్థానాల్లో 50 నుంచి 65 శాతం మంది ఉన్నారు. ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ అక్కడి చిన్న చిన్న రాజకీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 312 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 403 నియోజకవర్గాలలో మెజారిటీ స్థానాలను గెలిచింది. 39.67 శాతం ఓట్లను పొందింది. సమాజ్ వాదీ పార్టీ 47, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ 19, కాంగ్రెస్ 7 సీట్లను మాత్రమే గెలిచా

Follow Us:
Download App:
  • android
  • ios