దొంగతనాలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడో దొంగ. ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తెలిసిన విషయాలు వారిని షాక్ కు గురి చేశాయి.
ఢిల్లీ : దొంగతనాలు చేస్తూ.. కోట్లలో ఆస్తులు కూడబెట్టిన ఓ దొంగను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలో ఒంటరిగా ఈ దొంగ 200కు పైగా చోరీలు చేశాడు. పోలీసులకు దొరకకుండా చోరీలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. ఇలా సంపాదించిన సొమ్ముతో ఢిల్లీ నుంచి నేపాల్ వరకు అనేక ఆస్తులు పోగేశాడు. అనేక దొంగతనాల్లో పోలీసులు ఇతడిని వివిధ పేర్లతో 9సార్లు అరెస్టు చేశారు. ఇక ఈ దొంగ ఆస్తుల వివరాలు తెలిస్తే ఆశ్చర్యంతో నోరేళ్లబెట్టాల్సిందే.
దొంగ సొతుతో లక్నో, ఢిల్లీలో సొంత ఇండ్లు నిర్మించుకున్నాడు. యూపీలోని సిద్ధార్థ నగర్ లో భార్యపేరుతో ఓ గెస్ట్ హౌస్ కొన్నాడు. నేపాల్ లో తన పేరుతో ఒక హోటల్ కొన్నాడు. ఈ ఘరానా దొంగపై 2001 నుంచి 2013 వరకు 15 పైగా క్రిమినల్ కేసులో నమోదయ్యాయి. ఎలా దొరికాడంటే.. కోటీశ్వరుడైన ఒక హోటల్ వ్యాపారిని.. ఒక ఇంట్లో దొంగతనం చేశాడనే ఆరోపణలతో మోడల్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
గుజరాత్‌లో గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొననున్న డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్: స్వాగతమంటూ మోడీ ట్వీట్
మనోజ్ చౌబేగా గుర్తించిన అతను.. గడిచిన 25 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అంతేకాదు అతను ఒక్కడే 200లకు పైగా దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు దీనికి సంబంధించి ఇలా వివరాలు చెప్పుకొచ్చారు. మనోజ్ చౌబే అనే 45 ఏళ్ల ఈ వ్యక్తి కుటుంబం ఉత్తర ప్రదేశ్ లోని సిద్ధార్థ నగర్ లో ఉండేది. అక్కడి నుంచి కొద్దికాలం తర్వాత నేపాల్ కు వెళ్లిపోయింది. 1997లో మనోజ్ చౌబే ఢిల్లీ వచ్చాడు. కీర్తి నగర్ పోలీస్ స్టేషన్లో క్యాంటీన్ లో పని చేశాడు.
ఆ సమయంలో క్యాంటీన్లో దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికాడు. జైలు శిక్ష పడింది. ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక ఇళ్లలో దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అలా దొంగతనం చేయగా వచ్చిన సొమ్ము ఎక్కువగా పోగవగానే ఊరికి వెళ్ళిపోతుండేవాడు. అలా దొంగిలించిన డబ్బులతో నేపాల్ లో మనోజ్ చౌబే ఒక హోటల్ పెట్టుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురితో అదే సమయంలో వివాహం చేసుకున్నాడు.
పెళ్లి సమయంలో వధువు తరపు వారికి తాను ఢిల్లీలో పార్కింగ్ కాంట్రాక్టు పనులు చేస్తుంటానని చెప్పాడు. పనుల్లో భాగంగా ఆరు నెలలకోసారి ఢిల్లీ వెళ్తుంటానని నమ్మించాడు. తాజాగా మనోజ్ అరెస్ట్ కావడంతో ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి. పోలీసులు అతని నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
