Asianet News TeluguAsianet News Telugu

ఇండో-మయన్మార్ బార్డర్ లో అస్సాం రైఫిల్స్ పై మిలిటెంట్ల కాల్పులు.. ఒక‌రికి గాయాలు

అరుణాచల్ ప్రదేశ్ లోని పారా మిలటరీ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఒక జేసీవో కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

Militants fired at Assam Rifles in Indo-Myanmar border.. One injured
Author
Tirap, First Published Aug 9, 2022, 12:38 PM IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత్-మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్స్ సైనికుల‌పై ఉగ్రవాదులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక అధికారికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని రక్షణ ప్రతినిధి ఒకరు ధృవీక‌రించారు. తిరప్ చాంగ్లాంగ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒక సిబ్బందికి గాయాలైనట్లు తేజ్‌పూర్‌లోని డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ అధికారికి సమాచారం అందించారు.

Bihar political crisis: గవర్నర్‌ను కలవనున్న నితీశ్ కుమార్.. బీజేపీకి షాక్ తప్పదా?.. కాసేపట్లోనే సంచలన ప్రకటన!

“ ఇండో మయన్మార్ సరిహద్దు నుండి మిలిటెంట్ జీపీఎస్ AR tps పై కాల్పులు జరిపిన సంఘటన ఈ రోజు తెల్లవారుజామున జెన్ ఏరియా తిరప్ చాంగ్లాంగ్‌లో జరిగింది. ఓ అధికారి చేతికి చిన్న గాయం అయ్యింది ’’ అని డిఫెన్స్ PRO ట్వీట్ చేశారు.

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో అస్సాం రైఫిల్స్ దళాలు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన తాజా ఘటనలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO) చేతికి గాయం కాగా.. నాగాలాండ్‌లోని నోక్లాక్ జిల్లాలో మరో కాల్పుల సంఘటన నమోదైంది. NSCN-KYA సభ్యులు కాల్పుల్లో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిన్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios