దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో లాక్ డౌన్ కొనసాగించారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు నానా యాతనలు పడుతున్నారు. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. అయితే.. అయితే.. అలా స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికులకు ఇప్పుడు కరోనా కలవరపెడుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...మహారాష్ట్రలో చిక్కుకున్న కార్మికులు  ప్రభుత్వ బస్సుల్లో ఝాన్సీ పట్టణం మీదుగా యూపీలోని బస్తీ కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి అధికారులు పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో కార్మికులందరినీ ఆస్పత్రికి తరలిరంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్మికులతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు.

ఇక ముంబై నుంచి ఇటీవల చత్తీస్‌గడ్‌కు చేరుకున్న ఓ వలస కార్మికుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను స్వస్థలాలకు చేర్చే శ్రామిక్‌ రైళ్ల ప్రయాణం మేడే రోజు ప్రారంభమైన విషయం తెలిసిందే. రైలులోనూ భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రతీ కోచ్‌లో 54 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. స్థానిక అధికారులు నిబంధనల ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం స్వస్థలాలకు చేరుస్తారు. ఇళ్లల్లో కాని, ప్రత్యేక కేంద్రాల్లో కానీ వారిని క్వారంటైన్‌ చేస్తారు