Asianet News TeluguAsianet News Telugu

స్వస్థలానికి సైకిల్ పై ప్రయాణం.. మధ్యలో భోజనం చేస్తుండగా..

దీంతో మే 5 వ తేదీన మరో ఏడుగురు స్నేహితులతో కలిసి.. స్వస్థలానికి బయలు దేరాడు. సైకిల్ వారు స్వస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. ఐదు రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి  లక్నో వరకు చేరుకున్నారు.
 

Migrant Cycling 1,000 Km Home Takes Meal Break, Hit By Car In UP, Dies
Author
Hyderabad, First Published May 11, 2020, 9:13 AM IST

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీనిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు. అయితే.. ఈ లాక్ డౌన్ లో వలస కార్మికులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కారు. ఇటీవల.. వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకొని.. రైళ్లు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కొందరు.. సైకిళ్లపై ఇంటికి చేరేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా ప్రయత్నించి.. ఓ వలస కార్మికుడు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన యూపీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యూపీకి చెందిన సగీర్ అన్సారీ(26) పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లాడు. అయితే.. లాక్ డౌన్ కారణంగా అతనికి పనేమీ దొరకలేదు. దీంతో మే 5 వ తేదీన మరో ఏడుగురు స్నేహితులతో కలిసి.. స్వస్థలానికి బయలు దేరాడు. సైకిల్ వారు స్వస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. ఐదు రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి  లక్నో వరకు చేరుకున్నారు.

మార్గ మధ్యలో శనివారం రోడ్డు డివైడర్ పై కూర్చొని తన స్పేహితలతో కలిసి  భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓకారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ క్రమంలో సగీర్ అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న అతని స్నేహితులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

కాగా.. ఆ కారు డ్రైవర్ తొలుత ప్రమాదం జరిగినందుకు డబ్బులు ఇస్తానని చెప్పి.. తర్వాత మాట మార్చాడని తోటి వలస కార్మికులు చెప్పారు. కాగా.. సగీర్ అన్సారీ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు స్థానిక స్వచ్ఛంద సంస్థ,కొందరు రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు.

వారు డబ్బు సహాయం చేసి అంబులెన్స్ లో స్వస్థలానికి మృతదేహాన్ని చేర్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios