పార్టీని వీడిన యడ్యూరప్ప సన్నిహితుడు
బీజేపీ నేత యడ్యూరప్పకి కర్ణాటక సీఎం పదవి దక్కినట్టే దక్కి దూరమయ్యింది. సీఎం పీఠాన్ని దక్కించుకొన్న కొద్ది గంటల్లోనే ఆ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ షాక్ నుంచి ఆయన ఇంకా తేరుకున్నట్టు కనిపించలేదు. అంతలోనే మరో పెద్ద షాక్ తగిలింది.
యడ్యూరప్పకి అత్యంత సన్నిహితుడు, బీజేపీలో కీలకనేత పుట్ట స్వామి పార్టీనీ విడుతున్నట్లు ప్రకటించారు. ఓబీసీ మోర్చా ఛైర్మన్ గా ఉన్న ఆయన తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మూడు పేజీల రాజీనామా లేఖ రాసి మరీ పంపించారు.
ఆ లేఖలో ‘ నా నిబద్ధత, పట్టుదల, విశ్వసనీయత, నన్ను నేను కాపాడుకోవడంలో విఫలమయ్యాను. రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న సయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నాకు కూడా పూర్తిగా తెలియడం లేదు. దయచేసి నా రాజీనామాను అంగీకరించండి’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
పుట్టస్వామి.. యడ్యూరప్పకి అత్యంత కీలకమైన వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే. రాజకీయంగా ఉన్నంత ఎదిగేందుకు ఆయనకు యడ్యూరప్ప క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి పార్టీకి దూరమవ్వడం యడ్డీకి నిజంగా షాక్ కలిగించే విషయమే.
