ప్రధాని నరేంద్ర మోడీకి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంగ్రాట్స్ చెప్పారు. భారత టీకా తయారీదారులతో, కరోనా సమస్యను ఎదురర్కోవడంలో భారత ప్రభుత్వంతో పార్ట్‌నర్షిప్ కలిగి ఉండటం చాలా ముఖ్యమైనవని బిల్ గేట్స్ తెలిపారు. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. భారత్ 200 కోట్ల వ్యాక్సినేషన్ మైలు రాయిని దాటడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గాను భారత్‌తో కలిసి పని చేయడం, కరోనా మహమ్మారి సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వంతో కలిసి పని చేయడంపై సంతోషంగా ఉన్నదని ఆయన ట్వీట్ చేశారు.
200 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తి చేసుకున్న భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అని మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్వయంగా ట్వీట్ చేశారు. భారత టీకా తయారీదారులతో, కరోనా సమస్యను ఎదురర్కోవడంలో భారత ప్రభుత్వంతో పార్ట్‌నర్షిప్ కలిగి ఉండటం చాలా ముఖ్యమైనవని బిల్ గేట్స్ తెలిపారు.
కరోనా టీకా పంపిణీ మొదలు పెట్టిన ఏడాది దాటుతున్న కాలంలో ఈ రికార్డును భారత్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలపై ప్రశంసలు కురిపించాలి. భారత్ మరోసారి చరిత్ర తిరగరాసిందని వివరించారు. 200 కోట్ల డోసుల పంపిణీ మైలురాయికి సహకరించిన అందరినీ తాను గర్విస్తానని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై అంతర్జాతీయ పోరాటాన్ని ఇది బలోపేతం చేసిందని తెలిపారు.
అదే విధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండ వీయ కూడా ఈ ఫీట్ పై ట్వీట్ చేశారు. చరిత్ర నిర్మితం అవుతున్నదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్ 200 కోట్ల కరోనా వ్యాక్సినేషన్ మార్క్ ను చేరుకున్నాదని వివరించారు. కౌంట్ డౌన్ మొదలైందని కదా అని పేర్కొన్నారు.
