సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ మందిరానికి విదేశీ విరాళాలను స్వీకరించడానికి కేంద్ర హోమ్ శాఖా అనుమతులిచ్చింది. అమృతసర్ లోని హార్మిందర్ సాహిబ్ కు  ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ ఆక్ట్ కింద విదేశీ విరాళాలను  స్వీకరించడానికి అనుమతులిచ్చింది. 

ఈ విషయాన్నీ నిన్న మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ వెల్లడించారు. హోమ్ మంత్రిత్వ శాఖ స్వర్ణ మందిరంలోని లంగర్ (ఆహారశాల) నిరంతరాయంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. 

ఇక హోమ్ మంత్రి అమిత్ షా మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలోని సిక్కులందరూ హార్మిందర్ సాహిబ్ కి నేరుగా సేవ చేసే వీలుంటుందని.... వారి బంధాలు మరింత బలపడతాయని అన్నారు.