మేవాత్: ఓ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు పొందారు. హర్యానాలోని వెనకబడిన జిల్లాల్లో ఒక్కటైన మేవాత్ లోని పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు ఆ మెప్పు పొందారు.

పాఠశాలలో డ్రాపౌట్స్ ను, ముఖ్యంగా బాలికల డ్రాపౌట్స్ ను తగ్గించినందుకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ టీచర్ మోడీ ప్రశంసలు అందుకున్నారు.

బాలికల్లో చదువుకోవాలనే ఉత్సుకతను పెంచడంలో బషీరుద్దీిన్ ఖాన్ కీలకమైన పాత్ర పోషించారని మోడీ ట్వీట్ చేశారు. ఆ ఉపాధ్యాయుడికి జాతీయ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు కూడా తెలిపారు 

54 ఏళ్ల బషీరుద్దీన్ ఖాన్ తరగతులు నిండుగా ఉండేలా చూశారు. విద్యాభ్యాసం ప్రాధాన్యాన్ని ఆయన జిల్లాల్లో పని గట్టుకుని వివరించారు. ఖాన్ పనిచేసిన మూడు గ్రామాల నుంచి బడికి వెళ్లే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది.