Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలోకి ‘ మెట్రో ’ శ్రీధరన్.. త్వరలో కేరళ అసెంబ్లీ బరిలోకి..?

భారత్‌లో మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇంజినీర్‌ శ్రీధరన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది.

Metro Man E Sreedharan To Join BJP Says Open To Fighting Kerala Polls ksp
Author
Thiruvananthapuram, First Published Feb 18, 2021, 2:16 PM IST

భారత్‌లో మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇంజినీర్‌ శ్రీధరన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది.

కేరళలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శ్రీధరన్‌ అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటం, ముఖ్యంగా కాషాయ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

కేరళలో ఈ ఆదివారం బీజేపీ నిర్వహిస్తోన్న విజయ్‌ యాత్రలో భాగంగా శ్రీధరన్‌ పార్టీలో చేరునున్నట్లు సమాచారం. 88 ఏళ్ల మెట్రోమ్యాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై శ్రీధరన్‌ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు నిజమేనని, అలాగే పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా సిద్ధమేనని వెల్లడించారు.

భారత దేశంలో మెట్రో రైళ్లకు రూపకల్పన చేసిన ఘనత శ్రీధరన్‌దే. ఈ రంగంలో అపార అనుభవమున్న ఆయన 2011లో ఢిల్లీ మెట్రో నుంచి పదవీ విరమణ పొందారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios