సోషల్ మీడియాలో ఒక మహిళకు మెసేజ్ లు పంపాడో వ్యక్తి. ఆమె స్నేహితుడు అలా చేయద్దని వారించినందుకు కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపేశారు.
మహారాష్ట్ర : సోషల్ మీడియాలో ఒక మహిళకు పంపిన మెసేజ్ ల విషయంలో జరిగిన వాగ్వాదం కారణంగా 21 ఏళ్ల యువకుడిని గురువారం కత్తితో పొడిచి చంపినట్లు నాగ్‌పూర్ పోలీసు అధికారి తెలిపారు.
అమిత్ మెష్రామ్ అనే వ్యక్తి స్నేహితురాలికి మెసేజ్‌లు పంపడం శ్రేయాన్ష్ పాటిల్ అనే వ్యక్తికి తెలిసింది. దీంతో శ్రేయాన్ష్, అమిత్ ను అలా మెసేజ్ చేయడంమానుకోమని కోరాడని.. ఈ నేపథ్యంలోనే గొడవ హత్యకు దారితీసిందని జరిపట్కా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
మీడియా హైప్.. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం ఆగ్రహం
"గత వారం రోజులుగా ఇద్దరూ ఒకరినొకరు బెదిరింపు మెసేజ్ లు పంపుకుంటున్నారు. గురువారం ఉదయం, మెష్రామ్, అతని అనుచరులైన ఇద్దరు మైనర్లు పాటిల్‌తో ఘర్షణ పడ్డారు. ఆ తరువాత కత్తి, రాడ్‌లతో దాడి చేశారు. ఈ దాడిలో పాటిల్ ప్రాణాలు కోల్పోయాడు" అని పోలీసులు తెలిపారు.
మెష్రామ్‌ను అరెస్టు చేశామని.. అతని ఇద్దరు మైనర్ సహచరులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కేవలం రూ.10 కోసం చెలరేగిన వివాదం ఓ దుకాణదారుని ప్రాణాలు తీసింది. అతడిని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు - మహేశ్‌చంద్ జాతవ్, దళితుడు. అతను తన తాత్కాలిక దుకాణం వెలుపల నిద్రిస్తుండగా, నిందితుడు గుల్ఫామ్ అలియాస్ గుల్లా బంజారా అతని తలపై కాల్చాడు.
జూన్ 12న ఈ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత మంగళవారం జూన్ 27,గుల్ఫామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జాతవ్ తన దుకాణంలో పెట్రోల్‌తో పాటు ఇతర వస్తువులను విక్రయించేవాడని గుల్ఫామ్ వెల్లడించాడు.
ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు గుల్ఫామ్ జాతవ్ దగ్గర పెట్రోల్ కొనుగోలు చేశాడు. డబ్బులు ఇచ్చాడు.. అయితే గుల్ఫామ్ ఇచ్చిన డబ్బుల్లో పది రూపాయలకు తక్కువయ్యాయి. ఈ విషయాన్ని జాతవ్.. గుల్ఫామ్ ను నిలదీశాడు.
బ్యాలెన్స్ మొత్తం ఇవ్వాలంటూ గుల్ఫామ్ జాతవ్‌ను అడిగాడు. కానీ, అతను దానికి నిరాకరించాడు, ఇది వారి మధ్య వాగ్వాదానికి దారితీసింది. మహేశ్‌చంద్ జాతవ్.. గుల్ఫామ్‌ను డబ్బులు మొత్తం ఇవ్వకపోతే అంతుచూస్తా అని బెదిరించాడని నిందితులను విచారించిన తర్వాత పోలీసులు తెలిపారు.జాతవ్ బెదిరించడంతో, గుల్ఫామ్ తీవ్ర కోపానికి వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 12 రాత్రి జాతవ్‌ను కాల్చి చంపాడు.
