Asianet News TeluguAsianet News Telugu

Amar jawan jyoti: కేంద్ర నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు.

Amar jawan jyoti: ఇండియా గేట్ వద్ద ఉన్న‌ అమర జవాను జ్యోతిని, జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్యోతితో విలీనం చేయ‌డంపై విభిన్న స్వ‌రాలు వినిపిస్తోన్నాయి. కేంద్ర నిర్ణ‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. కానీ, మెమోరియల్‌తో విలీనం చేయాలనే నిర్ణయాన్ని సాయుధ దళాల అనుభవజ్ఞులు స్వాగతించారు.

Merging Amar Jawan Jyoti with War Memorial Torch
Author
Hyderabad, First Published Jan 21, 2022, 1:47 PM IST

Amar Jawan Jyoti: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం' వద్ద ఉండే జ్యోతిలో విలీనం చేయనున్నారు. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో  ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల జ్ఞాప‌కార్థంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. ఈ జ్యోతి గ‌త 50 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతునే ఉంది. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు అమర జవాన్ జ్యోతిని  శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జాతీయ యుద్ధ స్మారకం జ్యోతిలో క‌లుప‌నున్నారు. ఈ నిర్ణ‌యంపై  భిన్న స్వ‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఈ జ్యోతిని  ఆర్పేయనున్నారనే ప్రచారం చేస్తోంటే.. కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. అమర జవాన్ జ్యోతిని ఆర్పేయట్లేదని..  జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో దాన్ని విలీనం చేయనున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్లడిస్తున్నాయి. అమర జవాన్ జ్యోతి వెలిగే చోట అమర జవాన్ల పేర్లు లిఖించబడి లేవని, అలాంటి చోట వారికి నివాళులు అర్పించడం సరికాద‌ని కేంద్రం పేర్కొంది.

ఇదిలా ఉంటే.. అమర్ జవాన్ జ్యోతి జ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్‌తో విలీనం చేయాలనే నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంద‌రు సాయుధ దళాల అనుభవజ్ఞులు స్వాగతించారు. 
 
మొదటి ప్రపంచ యుద్ధం, అంతకుముందుకు జ‌రిగిన యుద్దాల్లో మరణించిన (84,000) సైనికులకు నివాళులు అర్పించేందుకు  బ్రిటిష్ పాల‌కులు చేత నిర్మించ‌బడింది ఇండియా గేట్. అక్క‌డ‌ అమర్ జవాన్ జ్యోతిని తాత్కాలిక ఏర్పాటుగా  చేశార‌ని తెలిపారు.  మూడేళ్ల కిందట కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించింది. ఫిబ్రవరి 2019లో మోదీ దీనిని ప్రారంభించారు. 1947 నుంచి దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పేర్లను ఈ స్మారకంపై లిఖించారు. అమ‌ర జవాన్ జ్యోతిని  క‌ల‌ప‌డం సరైన నిర్ణ‌య‌మేన‌ని నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ (రిటైర్డ్) అన్నారు.

అమ‌ర జ‌వాన్ జ్యోతికి  దేశ‌ పౌరుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని అని పేరు కేంద్ర నిర్ణ‌యంలో  తప్పు ఏమీ కనిపించలేదని అన్నారు.ఈ విష‌యంపై మాజీ సైనికాధికారి చిత్రాంజన్ సావంత్ మాట్లాడుతూ.. ఇండియా గేట్ అనేది బ్రిటిష్ వారు నిర్మించిన వార్ మెమోరియల్. 1947 నుండి నేటి వరకు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించింది నేషనల్ వార్ మెమోరియల్ అనీ, అమర్ జవాన్ జ్యోతిని  నేషనల్ వార్ మెమోరియల్‌తో క‌ల‌ప‌డం స‌రైన‌దే..  అని చిత్రాంజన్ సావంత్ (రిటైర్డ్) అన్నారు.  
  
అమర్ జవాన్ జ్యోతి

మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918), మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం (1919)లో మరణించిన భారత సైనికుల స్మారకార్ధం నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా గేట్‌ను నిర్మించింది. ఆల్ ఇండియా వార్ మెమోరియల్ ఆర్చ్ 42 మీటర్ల స్థూపంపై సైనికుల పేర్లు చెక్కించారు.
తర్వాత 1971 బంగ్లా విమోచన యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికుల గౌరవార్ధం  1972లో ఇందిర హాయంలోని  అమర జవాన్ జ్యోతి ఆర్చి నిర్మించింది. అప్పటి నుంచి ఇక్కడ 50 ఏళ్లుగా అమర జవాన్ జ్యోతి ఏకధాటిగా వెలుగుతోంది. రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ స్థాయి ఉత్సవాల సందర్భంగా సైనికులకు ఇక్కడ నివాళలర్పిస్తుంటారు.
 

నేషనల్ వార్ మెమోరియల్

మూడేళ్ల కిందట కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించింది. 2019లో నేషనల్ వార్ మెమోరియల్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1947 నుండి దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. నూత‌నంగా నిర్మించిన‌..  మెమోరియల్ ఇండియా గేట్ కాంప్లెక్స్‌లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్క‌డ సూప్తంపై  అమ‌ర సైనికుల పేర్లను చెక్కారు.  
అయితే... రెండు స్మారకాల నిర్వహణ కష్టంగా మారడంతోనే అమర జవాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios