తాజాగా ఓ యువకుడు తన స్నేహితుడి తో కలిసి రోడ్డు పై వెళ్తుంటే రెండు కుక్క పిల్లలు కనిపించాయి. అయితే, వాటిని ఆ యువకుడు బెదరకొట్టాడు. అవి భయంతో వెనక్కి వెళ్లిపోయాయి. 

మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు కనిపించడం చాలా సహజం. అలా కుక్కలు కనిపించినప్పుడు కొందరు వాటిని ఏం పట్టించుకోకుండా వెళతారు. కొందరు వాటిపై ప్రేమ చూపిస్తారు. మరి కొందరు అవి వారిని ఏమీ అనకపోయినా వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

తాజాగా ఓ యువకుడు తన స్నేహితుడి తో కలిసి రోడ్డు పై వెళ్తుంటే రెండు కుక్క పిల్లలు కనిపించాయి. అయితే, వాటిని ఆ యువకుడు బెదరకొట్టాడు. అవి భయంతో వెనక్కి వెళ్లిపోయాయి. కానీ, నెక్ట్స్ మినిట్ లో ఆ రెండు కుక్క పిల్లలు, తమ తల్లి కుక్క తో కలిసి అతనిపై దాడికి దిగడం గమనార్హం. ఇంకేముంది ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరుగు లింకించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కడుపారా నవ్వుకుంటున్నారు.

Scroll to load tweet…

ఈ వీడియోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. మీకన్నా బలవంతమైన వారు కచ్చితంగా ఉంటారు’ అంటూ ఆ వీడియో కి క్యాప్షన్ పెట్టడం విశేషం. ఆ వీడియోకి ఒక మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రతి ఒక్కరికీ అలా బిగ్ ఫ్రెండ్ ఉంటారని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఆ కుక్క పిల్లలు తమ తండ్రి కుక్కను తీసుకువచ్చాయి అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరేమో, ఆ కుక్క పిల్లలు తిరిగి అలాంటి షాక్ ఇస్తారని పాపం వాళ్లు ఊహించి ఉండరు అని కామెంట్ చేయడం విశేషం.