పంజాబ్ నేషనల్ బ్యాంకును దారుణంగా మోసం చేసి.. ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ విదేశాలకు చెక్కేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా.. ఇటీవల ఆయన తన గర్ల్ ఫ్రెండ్ తో డిన్నర్ కి వెళ్లి.. డొమినికా పోలీసులకు చిక్కారు. గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్లి దొరికాడంటూ.. వార్తలు వచ్చాయి.  ఈనేపథ్యంలో ఆ వార్తలపై మెహుల్ ఛోక్సీ భార్య ప్రీతి ఛోక్సీ స్పందించారు.

ఆమె తన భర్తకు గర్ల్ ఫ్రెండ్ కాదని.. కేవలం తెలిసిన వ్యక్తేనని ఆమె పేర్కొన్నారు. ఛోక్సీ వెంట ఉన్న అమ్మాయి.. ఆయనతోపాటు అతని సన్నిహితులకు కూడా తెలుసు అని ఆమె పేర్కొన్నారు. అంటిగ్వాను సందర్శించిన సమయంలో ఛోక్సీతో వాక్ చేస్తుంటుందన్నారు.

అయితే.. ఛెక్సీ తో నడిచిన మహిళ. మీడియా ఛానెళ్లలో చూపిస్తున్న మహిళ ఒకరు కాదని ఆమె తెలిపారు. ఛోక్సీ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వి ందు కోసం డొమినికా వెళ్లి ఉంటాడంటూ అంటిగ్వా-భార్బుడా ప్రధాని గస్టన్ బ్రౌనే ఇటీవల చేసిన కామెంట్స్ పెద్ద చర్చనీయాంశమయ్యాయి..

ఇదిలా ఉండగా.. డొమినికాలో ఛోక్సీని హింసిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కూడా ప్రీతి స్పందించారు. తన భర్త విషయంలో మానవ హక్కులను విస్మరించి హింసకు గురిచేయడం తమ కుటుంబాన్ని ఆవేదనకు  గురిచేస్తోందన్నారు. ఆయనను సజీవంగా రప్పించాలనకున్నప్పుడు హింసించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఆయనను.. శారీరకంగా, మానసికంగా వేధించడం ఎందుకు అని ప్రశ్నించారు. తన భర్తకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.