కేంద్రంలోని బీజేపీతో ఉన్న గత సానిహిత్యం వల్లే పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కాశ్మీర్ విషయంలో వ్యాఖ్యలు చేశారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీని, మహబూబా ముఫ్తీని విమర్శించారు. పీడీపీ సిద్ధాంతాన్ని శివసేన ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపారు
పాకిస్థాన్ (pakistan)తో, జమ్మూ కాశ్మీర్ (jammu kashmir) ప్రజలతో కేంద్రం చర్చలు జరిపేంత వరకు కాశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) వ్యాఖ్యానించిన ఒక రోజు తరువాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (shiv sena mp sanjay raut) స్పందించారు. బీజేపీ (bjp) మహబూబా ముఫ్తీకి బలాన్ని ఇచ్చినందుకే పీడీపీ అధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేశాయని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో గతంలో బీజేపీ తో కలిసి ఆమె పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
ఆదివారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) ఏదో ఒక సమయంలో బీజేపీకి ఫ్రెండ్ అని అన్నారు. PDP మొదటి నుంచి పాకిస్తాన్ అనుకూలమైనదని, ఉగ్రవాదుల పట్ల సానుభూతి ఉంటుందని ఆయన తెలిపారు. పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురుకు ముఫ్తీ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రౌత్ విమర్శించారు.
అలాంటి నేపథ్యం ఉన్న మహబూబా ముఫ్తి ఇప్పుడు కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని కోరుకుంటున్నారని, ఇది బీజేపీ చేసిన పాపం అని రౌత్ ఆరోపించారు. బీజేపీ వారితో అధికారం పంచుకోవడం ద్వారా అలాంటి వ్యక్తులకు బలాన్ని ఇచ్చిందని అన్నారు. అందుకే మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలకు బీజేపీ బాధ్యత వహిస్తుందని చెప్పారు.
ఈ అంశంపై ఇప్పుడు బీజేపీ అభిప్రాయం ఏదైనప్పటికీ, పీడీపీ సిద్ధాంతాన్ని శివసేన ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని సంజయ్ రౌత్ అన్నారు. ఇదిలా ఉండగా 2015లో జమ్మూ కాశ్మీర్‌లో PDP, BJP కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2018లో ఆ పొత్తు తెగిపోయింది. అయితే శనివారం పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ప్రజలతో చర్చల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు రావాలని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ రోజూ కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని, 22 గంటలు పనిచేస్తారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ (maharashtra bjp president chandrakant patil) ఇటీవల చేసిన వ్యాఖ్యను సంజయ్ రౌత్ ప్రస్తావిస్తూ.. “ పాటిల్ వ్యాఖ్యలను విని రెండు గంటల నిద్రను కూడా కోల్పోయారు ” అని ప్రధాని మోడీ (pm modi)ని ఉద్దేశించి ఆయన చమత్కరించారు. పాటిల్ వంటి బీజేపీ నేతల అభిప్రాయం ప్రకారం మోదీ మాత్రమే కష్టపడి పని చేస్తారని, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (jeo biden), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin), ఉక్రెయిన్‌కు చెందిన వోలోడిమిర్ జెలెన్స్కీ (volodymyr zelensky) సహా ప్రపంచంలో మరే నాయకుడు ఇలా పని చేయలేరని సంజయ్ రౌత్ వ్యంగంగా అన్నారు. ‘‘ సైకోఫాంట్లు గతంలో కూడా ఉన్నారు. మహాత్మా గాంధీకి, సర్దార్ పటేల్‌కు కూడా సైకోఫాంట్లు ఉన్నారు. అయితే ఇంతకు ముందు ఇలాంటి సైకోఫాంట్స్‌ని మాత్రం మనం చూడలేదు అని శివసేన నాయకుడు అన్నారు.
