మేఘాలయలో దారుణం జరిగింది. ఓ మహిళను కొంతమంది అందరూ చూస్తుండగానే షెడ్‌లోకి తీసుకెళ్లి, ప్రశ్నలు వేసి, ఆపై స్తంభానికి కట్టేసినట్లు చూపిస్తున్న వీడియో వైరల్ గా మారింది. 

షిల్లాంగ్ : Meghalayaలోని జోవాయి వద్ద ఓ మార్కెట్ లో ఒక womanను స్తంభానికి కట్టేసి, జేబు theftకి పాల్పడినట్లు ఆరోపిస్తూ హింసించిన ఘటనపై, ప్రమేయం ఉన్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని శుక్రవారం అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు viralగా మారింది. అయితే ఇది ఎప్పటిది అనేది తెలిపే అధారాలు ఏమీ లేదు. ఓ మహిళను పగటిపూట గుర్తుతెలియని వ్యక్తులు షెడ్‌లోకి తీసుకెళ్లడం, ప్రశ్నలు అడగడం, చుట్టూ ఉన్నవారు హేళనలు చేయడం కనిపిస్తుంది. అదే సమయంలో మహిళను స్తంభానికి కట్టివేయడం కూడా ఇందులో కనిపిస్తుంది. 

ఆ సమయంలో ఘటనా స్థలంలో ఉన్న చిన్నారులు, యువకులు, మహిళలు ఆమెను ఎగతాళి చేయడం కనిపించింది. ఆమె మెడలో శాలువా, చేతికి బ్యాగ్ ఉన్నట్టుగా షెడ్ కు తీసుకువెడుతున్న సమయంలో కనిపిస్తుంది. అయితే ఆమెను స్తంభానికి కట్టివేస్తున్న దృశ్యాలు అందులో లేవు. 

సీనియర్ పోలీసు అధికారి పిటిఐతో మాట్లాడుతూ, "ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఆ ప్రాంతంలోని మహిళా పోలీసు స్టేషన్ నుండి ఒక అధికారిని, బృందాన్ని పంపారు. వీడియోలో కనిపించే వ్యక్తులందరినీ విచారణ కోసం పిలుస్తాం" అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వీడియోను ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మాతో పాటు మేఘాలయ పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిమీద స్పందిస్తూ "ఈ విషయంలో @Jowai_Police చర్య తీసుకున్నారు" అని ట్విట్టర్‌లో తెలిపారు. అయితే వివరాలు ఇంకా తెలియరాలేదు. 

ఇక స్తంభానికి కట్టి ఉన్న మహిళ చిత్రాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు గురువారం ఈ విషయం తెలియజేసినట్లు తెలిపారు. "నేరస్థులను కఠినంగా శిక్షిస్తారని, మహిళను సురక్షితంగా ఉందని, పునరావాసం పొందిందని నేను ఆశిస్తున్నాను" అని అతను తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

మహిళా హక్కుల కార్యకర్త ఆగ్నెస్ ఖర్షియింగ్ ఈ ఘటనను ఖండించారు. "మహిళను చిత్రహింసలకు గురిచేసిన వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అని ఆమె అన్నారు.