భారత దేశానికి చెందిన సుమన్ రావు మూడో స్థానంలో నిలవడంతో అందరూ సుమన్ రావు గురించి తెగ వెతికేస్తున్నారు. ఇంటర్నెట్ అంతా సుమన్ రావు అని ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సుమన్ రావు ప్రొఫైల్ మీకోసం... 

జమైకాకు చెందిన టోనీ–ఆన్‌ సింగ్‌ మిస్‌ వరల్డ్‌–2019 కిరీటం దక్కించుకొంది. లండన్‌లోని ఎక్సెల్‌ లండన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం రాత్రి అంగరంగ
 వైభవంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ లో జమైకాకు చెందిన టోనీ–ఆన్‌ సింగ్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకొన్నారు 

ఈ పోటీలో ఫస్ట్‌ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్ రన్నర్ అప్ గా ఇండియాకు చెందిన సుమన్ రావు నిలిచారు.

Also read: జమైకా సుందరికి మిస్ వరల్డ్ కిరీటం: ఇండియాకు చెందిన సుమన్‌రావుకు మూడో స్థానం

ఈ కార్యక్రమానికి బ్రిటిష్ జర్నలిస్ట్, టీవీ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 120 దేశాలు పాల్గొన్నాయి, అందులో 10 దేశాలు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. 

View post on Instagram

మిస్ నైజీరియా, మిస్ బ్రెజిల్ కూడా టాప్ 5 కి అర్హత సాధించాయి, చివరి రౌండ్ లో మోర్గాన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. భారత దేశానికి చెందిన సుమన్ రావు మూడో స్థానంలో నిలవడంతో అందరూ సుమన్ రావు గురించి తెగ వెతికేస్తున్నారు. ఇంటర్నెట్ అంతా సుమన్ రావు అని ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సుమన్ రావు ప్రొఫైల్ మీకోసం... 

View post on Instagram

సుమన్ రావుది రాజస్థాన్ రాష్ట్రం. ఆమె 1998 నవంబర్‌ 23 లో రాజస్తాన్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్‌ సమీపంలోని అయిదానాలో పుట్టారు. తండ్రి రతన్ సింగ్, తల్లి సుశీలా కున్వర్, తండ్రి నగల వ్యాపారి, తల్లి గృహిణి. 

సుమన్ రావు నవీముంబైలోని మహాత్మా స్కూల్‌ ఆఫ్‌ అకాడెమిక్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్‌ అకౌంటెన్సీ చదువుతున్నారు.

2018లో మిస్‌ నవీముంబై పోటీలో సుమన్ రావు మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్‌ తరఫున పాల్గొని ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ –2019ను, ఆ పోటీల్లోనే మిస్‌ ర్యాంప్‌వాక్‌ అవార్డు గెలుచుకున్నారు

ఈ ఏడాది జూన్‌లో రాజస్థాన్ కు చెందిన సుమన్ రావు మిస్ ఇండియా 2019 టైటిల్ గెలుచుకుంది. ఈ జూన్ లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్నాక ఆమె ఒక ఇంటర్వ్యూలో అనేక అంశాలను చెప్పారు. 

సమాజంలో లింగ వివక్షతను అంతం చేయాలంటే అందరూ గళమెత్తాలని ఆమె అన్నారు. లింగ సమానత్వం సమాజంలో అత్యంత అవసరమని ఆమె అభిప్రాయపడింది. తాను ఈ విషయమై తన స్వరాన్ని వినిపించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. 

 "నేను లింగ సమానత్వానికి స్వరం కావాలనుకుంటున్నాను. నేను అసమానత కారణంగా బాలికలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో చూస్తూ పెరిగాను. నా చుట్టుపక్కల పరిస్థితులు కూడా అలానే ఉండేవి. నేను కూడా అలంటి కట్టుబాట్లనుండి వచ్చాను, స్వేచ్ఛ, సమానత్వాలపై వారిలో అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను" అని సుమన్ తెలిపారు. 

"నన్నునా ఇష్టానుసారంగా ఉండేలా అనుమతించే కుటుంబంలో పుట్టడం చాలా అదృష్టం, కాని అమ్మాయిలందరూ నా లాంటి అదృష్టవంతులు కాదు" అని అమ్మాయిల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసారు. 

ఇక ఈ అమ్మడు సినిమాల్లో నటించాలని కళలు కంటున్నట్టు తెలిపింది. మీ కోసం ఈ అమ్మడి ఇంస్టాగ్రామ్ నుండి కొన్ని ఫోటోలు... 

View post on Instagram
View post on Instagram