జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్న తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా లెఫ్టినెంట్ భావనా కాంత్ రికార్డుల్లోకెక్కారు. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె... తన చిన్నతనం నుండి, టీవీల్లో రిపబ్లిక్ డే పరేడ్ చూస్తున్నానని... అలాంటి ఇప్పుడు తాను అందులో పాల్గొనడం గర్వంగా వుందని భావనా అన్నారు. 

 

 

ప్రస్తుతం, ఆమె రష్యా తయారు చేసిన యుద్ధ విమానం మిగ్ -21 (బైసన్) పైలట్‌గా బికనీర్‌‌లోని నల్ ఎయిర్ బేస్ వద్ద పోస్ట్ చేయబడ్డారు. ఇతర విమానాలను నడపడం గురించి విలేకర్లు అడిగినప్పుడు భావనా కాంత్ మాట్లాడుతూ.. రాఫెల్, సుఖోయ్‌లతో సహా ఇతర యుద్ధ విమానాలను నడపడానికి నేను ఇష్టపడతానని చెప్పారు.

 

 

బీహార్‌కు చెందిన బెగుసారయ్‌‌కు చెందిన కాంత్ 2016లో భారత వైమానిక దళంలో చేరిన ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్ల మొదటి బ్యాచ్‌లో ఒకరు. ఆమె నవంబర్ 2017 లో ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరి మిగ్ 21 బైసన్‌లో సోలో ఫ్లయింగ్ తర్వాత మార్చి 2018లో ఆపరేషనల్ విభాగంలోకి వచ్చారు. 

కాగా, రెండు రాఫెల్ ఫైటర్ జెట్‌లు ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో మొదటి సారి పాల్గొననున్నాయి. రాఫెల్‌లు ఏకలావ్య, బ్రహ్మాస్త్రం మాదిరిగా ఎగురుతాయి. ఏకలవ్య రూపంలో రెండు జాగ్వార్లు, రెండు మిగ్ - 29లతో కలిసి భాగం పంచుకోనుంది. 

 

 

రూ.59,000 కోట్ల విలువైన 36 రెడీమెడ్ రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి 2016లో భారత ప్రభుత్వం ఫ్రెంచ్  ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఎనిమిది జెట్లను డెలీవరి చేసింది ఫ్రాన్స్. ఇవి ప్రస్తుతం హర్యానాలోని అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మోహరించారు. తదుపరి బ్యాచ్‌కు చెందిన మూడు విమానాలు ఈ నెలాఖరుకు భారత్ చేరుకుంటాయి. 

కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొత్తం 42 విమానాలు పాల్గొంటున్నాయి. వీటిలో 15 ఫైటర్స్, 5 ట్రాన్స్‌పోర్ట్, 17 హెలికాఫ్టర్లు, 1 వింటేజ్, 4 ఆర్మీ ఏవియేషన్ హెలికాఫ్టర్లు ఉంటాయి. ఇవన్నీ రాఫెల్‌తో కలిసి విక్టర్ చార్లీ ఫార్మేషన్‌లో ఎగురుతాయి. ఐఏఎఫ్ టేబులాక్స్ ఎల్‌సీఏ తేజస్, లైట్ కంబాట్ హెలికాఫ్టర్, రోహిణి రాడార్, ఆకాశ్ మిస్సైల్, సుఖోయ్ 30 ఏంకేఐ మోడల్‌ను ప్రదర్శిస్తుంది. 

1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. బంగ్లాదేశ్ ఆర్మీ ప్రతినిధి బృందం ప్రత్యేక ఆహ్వానితుడిగా రాజ్‌పథ్‌లో అడుగుపెట్టనుంది. ఐఏఎఫ్ పాతకాలపు డకోటా విమానం, రెండు ఎంఐ 171 వి హెలికాఫ్టర్‌లతో నిండి వుంది. ఆ సమయంలో రుద్ర ఫార్మాట్‌లో ఎగురుతాయి.