ల్యాబ్ టెక్నీషీయన్‌పై దాడి: కరోనా అనుమానితుల శాంపిల్స్‌ ఎత్తుకెళ్లిన కోతులు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతులు చేసిన పనికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కరోనా అనుమానితుల వద్ద నుండి సేకరించిన శాంపిల్స్ ను తీసుకెళ్తున్న ల్యాబ్ టెక్నీషీయన్ పై కోతులు దాడికి దిగాయి. ల్యాబ్ టెక్నీషీయన్ వద్ద ఉన్న కరోనా అనుమానితుల శాంపిల్స్ ను ఎత్తుకొని పారిపోయాయి.
 

Meerut Monkeys run away with COVID-19 test samples, locals fear spread of infection

మీరట్: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతులు చేసిన పనికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కరోనా అనుమానితుల వద్ద నుండి సేకరించిన శాంపిల్స్ ను తీసుకెళ్తున్న ల్యాబ్ టెక్నీషీయన్ పై కోతులు దాడికి దిగాయి. ల్యాబ్ టెక్నీషీయన్ వద్ద ఉన్న కరోనా అనుమానితుల శాంపిల్స్ ను ఎత్తుకొని పారిపోయాయి.

శుక్రవారం నాడు ఉదయం మీరట్ మెడికల్ కాలేజీ ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకొంది. ముగ్గురు అనుమానితుల నుండి శాంపిల్స్ ను ఇవాళ సేకరించారు. అనుమానితుల నుండి సేకరించిన శాంపిల్స్ ను పరీక్షించకముందే కోతులు ఆ నమూనాలను ఎత్తుకొని పారిపోయాయి.

తర్వాత కొద్దిసేపటికి కోతుల గుంపులో ఓ కోతి శాంపిల్స్ కిట్ ను నమిలేందుకు ప్రయత్నిస్తోంది. శాంపిల్స్ సేకరించే కిట్ చెట్టు కింద కన్పించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:40 చపాతీలు, 10 ప్లేట్ల భోజనం: క్వారంటైన్ కేంద్రంలో చుక్కలు చూపిస్తున్నాడు

అయితే ఈ విషయం తన దృష్టికి రాలేదని జిల్లా మేజిస్ట్రేట్ అనిల్ దింగ్రా చెప్పారు. అంతేకాదు ఈ విషయమై విచారణ నిర్వహించనున్నట్టుగా చెప్పారు.కరోనా అనుమానితుల శాంపిల్స్ ను కోతుల గుంపు జనావాసాల వైపుకు తీసుకెళ్లాయి. దీంతో స్థానికులు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అనుమానపడుతున్నారు.

మనిషి నుండి కోతులకు కరోనా వైరస్ సోకే అవకాశం ఉంది. కోతులకు రోగ నిరోధక శక్తిని కలిగి లేవు. కరోనా సోకిన కోతులు బతికి ఉంటే రోగ నిరోధక శక్తిని అభివృద్ది చేసుకొనే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మనుషుల నుండి జంతువులకు కరోనా సోకిన సందర్భాలు కూడ పలు చోటు చేసుకొన్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో న్యూయార్స్ లోని జూ లో పులికి కరోనా లక్షణాలు కన్పించాయి. కుక్కలు, పిల్లులకు కూడ కరోనా సోకినట్టుగా వార్తలు వచ్చాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios