Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. మెక్ డోనాల్డ్స్ వాడేసిన నూనెను ఏంచేస్తోందో తెలుసా..?

ఒక్కసారి ఏదైనా ఫుడ్ ని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ నూనెని ఏం చేస్తారు..?  పదే పదే అదే నూనెని వాడితే.. కష్టమర్ల ఆరోగ్యానికే దెబ్బ. మరి మెక్ డోనాల్డ్స్ ఏం చేస్తోందోతెలుసా..?

McDonald's to recycle used cooking oil to power its delivery trucks

మెక్ డొనాల్డ్స్ ఈ పేరు తెలియని వాళ్లు ప్రస్తుతకాలంలో అరుదు. అక్కడ లభించే బర్గర్స్ , శాండివిచ్ లను తినడానికి జనాలు క్యూలు కట్టేస్తుంటారు. అయితే.. ఈ మెక్ డొనాల్డ్స్ గురించి ఓ షాకింగ్ విషయం ఒకటి ఇప్పుడు బయటపడింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. రోజుకి కొన్ని వందలు, వేల మంది మెక్ డోనాల్డ్స్ లో ఫుడ్ తింటూ ఉంటారు. మరి ఇంత మందికి వంట చేయాలంటూ వంట నూనె వాడటం తప్పనిసరి. ఇక్కడ లభించే చాలా ఫుడ్స్.. డీప్ ఫ్రై చేసినవే ఉంటాయి. ఒక్కసారి ఏదైనా ఫుడ్ ని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ నూనెని ఏం చేస్తారు..?  పదే పదే అదే నూనెని వాడితే.. కష్టమర్ల ఆరోగ్యానికే దెబ్బ. మరి మెక్ డోనాల్డ్స్ ఏం చేస్తోందోతెలుసా..? ఆ నూనెను బయో డీజిల్‌గా మార్చి, తన రిఫ్రిజిరేటెడ్‌ ఫుడ్‌ ట్రక్స్‌ను నడిపిస్తోంది.

ప్రస్తుతం ముంబయిలోని వివిధ మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్లలో వినియోగించిన వంట నూనెను బయో డీజిల్‌గా మార్చి వాహనాల్లో వినియోగిస్తోంది. ప్రయోగదశలో ఉన్న ప్రాజెక్టును త్వరలో బెంగళూరలోనూ పరీక్షించనున్నారు. ‘మొత్తం 227 అవుట్‌లెట్లను రీసైకిల్‌ కార్యక్రమం కిందకు తీసుకువస్తాం’ అని సప్లయ్‌ చైన్‌, క్వాలిటీ అష్యూరెన్స్‌, హార్డ్‌క్యాసిల్‌ రెస్టారెంట్ల డైరెక్టర్‌ విక్రమ్‌ ఓగ్లీ తెలిపారు.

ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును యూనికాన్‌ బయోఫ్యూయిల్స్‌తో కలిసి మెక్‌డొనాల్డ్స్‌ గతేడాది ప్రారంభించింది. ముంబయి నగరంలోని 85 రెస్టారెంట్ల నుంచి వంట నూనెను సేకరించి, దాన్ని బయోడీజిల్‌గా మారుస్తున్నారు. నెలకు సుమారు 35వేల లీటర్ల వాడేసిన నూనె బయోడీజిల్‌గా మారుతోంది. వంటనూనెను రీసైకిల్‌ చేసి వినియోగించడం వల్ల డీజిల్‌తో పోలిస్తే 75శాతం కార్బన్‌ ఉద్గారాలు తక్కువ వెలువడతాయని చెబుతున్నారు.

గతేడాది నుంచి యూనికాన్‌ బయోఫ్యూయల్స్‌, హార్డ్‌ క్యాసిల్‌ రెస్టారెంట్లు వంట నూనెను బయో డీజిల్‌గా మార్చే ప్రక్రియను చేపట్టాయని, అది బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ప్రకారమే జరుగుతోందని బయోడీజిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు సందీప్‌ చతుర్వేది తెలిపారు. తాము ఈ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని, అందరూ ఇలా ఆలోచిస్తే పర్యావరణానికి మేలు చేసిన వారవుతారని ఆయన తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios