Asianet News TeluguAsianet News Telugu

వరుడి కోసం దిమ్మదిరిగే కండీషన్లు.. ఐఐటీల్లో చదువు.. రూ. 2 లక్షలకుపైగా జీతం: మ్యాట్రిమోనియల్ యాడ్ వైరల్

వరుడి కోసం ఇచ్చిన ఓ మ్యాట్రిమోనియల్ యాడ్ తెగ వైరల్ అయింది. అందులో వరుడి కోసం పెట్టిన కండీషన్లు దిమ్మదిరిగేలా ఉన్నాయి. వరుడు కచ్చితంగా టాప్ టయర్ ఇన్‌స్టిట్యూట్‌లలో చదువుకుని ఉండాలని, అక్కడి నుంచి డిగ్రీ తీసుకొని ఉండాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
 

matrimonial ad seeking specific education qualifications from top tier institutes went viral
Author
First Published Oct 19, 2022, 1:59 PM IST

న్యూఢిల్లీ: పెళ్లి కొడుకు కోసం ఓ కుటుంబం ఇచ్చిన మ్యాట్రిమోనియల్ యాడ్ వైరల్ అవుతున్నది. సాధారణంగా పెళ్లి కొడుకుల కోసం చాలా రకాల కండీషన్లు పెడతారు. ఆర్థికంగా, కుటుంబం పరంగా, హోదాల పరంగా చాలా రకాల కండీషన్లు మనం చూస్తూ ఉంటాం. అందులో చాలా స్పష్టంగా కులం, మతాలు కనిపిస్తాయి. చదువు, ఉద్యోగాలు, జీతాల గురించి కూడా ఉంటాయి. కానీ, తాజాగా వైరల్ అవుతున్న యాడ్‌లో కండీషన్లు చర్చనీయాంశం అయ్యాయి.

వరుడు జూన్ 1992 కంటే ముందు జన్మించి ఉండకూడదనే కండీషన్ పెట్టారు. అది చాలా సర్వసాధారణం. కానీ, దిమ్మదిరిగే కండీషన్లు అప్పుడే మొదలయ్యాయి. వరుడు టాప్ టయర్ విద్యా సంస్థల్లో డిగ్రీ చేసి ఉండాలని డిమాండ్ పెట్టారు. ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్, పీజీడీఎం వంటి డిగ్రీలు చేసి ఉండాలని పేర్కొన్నారు. ఒక వేళ ఆయన ఇంజినీర్ అయి ఉంటే ఐఐటీ బాంబే, మద్రాస్, కాన్పూర్, ఢిల్లీ, రూర్కీ,ఖరగ్‌పూర్, గువహతిల్లో డిగ్రీ చేసి ఉండాలని తెలిపారు. లేదా ఎన్ఐటీ, కాలికట్, ఢిల్లీ, కురుక్షేత్ర, జలంధర్, త్రిచి, సురత్కల్, వరంగ్ క్యాంపస్2లలో చేసి ఉండాలని పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్, అలహాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ఐఐఎస్‌సీ బెంగళూర్, బిట్స్ పిలానీ, హైదరాబాద్, డీటీయూ, ఎన్ఎస్ఐటీ లేదా కలకత్తాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో చదవి ఉండాలని తెలిపారు.

ఒక వేళ ఎంబీఏ చేసి ఉంటే.. ఆ డిగ్రీ ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇండోర్, లక్నో, కోళికోడ్, ఎఎంఎస్, ఐఎస్‌బీ, జేబీఐఎంఎస్, ఎండీఐ, ఎన్ఐటీఐఈ, ఎస్‌పీ జైన్, ఎస్‌జేఎంఎస్ఓఎం, ఎక్స్ఎల్ఆర్ఐల్లో చేసి ఉండాలని స్పష్టం చేశారు.

అంతేకాదు, ఆ వరుడి జీతం వార్షికంగా 30 లక్షలకు తక్కువగా ఉండకూడదని డిమాండ్ పెట్టారు. ఆ ఉద్యోగం కూడా కార్పొరేట్ సెక్టార్‌లో ఉండి ఉండాలని వివరించారు. ఈ డిమాండ్లతోపాటు ఓ వరుడి ఎత్తు ఐదు ఫీట్ల ఏ ఇంచుల నుంచి ఆరు ఫీట్ల వరకు ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు, వరుడి కుటుంబం గురించీ వారికి ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ వరుడి కుటుంబం చిన్నదై ఉండాలని, ముఖ్యంగా ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్క లేదా చెల్లెళ్లు ఉండాలని వివరించారు. అంతేకాదు, చదువుకున్న కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

Also Read: సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కాల్ చేయొద్దు.. పెళ్లి ప్రకటన వైరల్... మేమేం పాపం చేశాం అంటున్న టెకీలు...

ఈ యాడ్ పై అనేక కామెంట్లు వచ్చాయి. ఆమె తన భర్తను హైర్ చేస్తున్నదా? అని అడిగారు. మరో కామెంట్ అసలు జీవితం ఎప్పటికీ మనల్ని శాంతంగా ఉండనివ్వదు.. ఒక కండీషన్ తర్వాత మరొకటి వస్తూనే ఉంటుందని తన అనుభవాన్ని జోడించారు.

మరొకరు ‘ప్రిఫరెన్సులు ఉండటంలో తప్పులేదు. తమ కూతురికి బెస్ట్ వరుడిని తేవాలని అందరూ అనుకుంటారు. కానీ, పురుషులకు కూడా ఆ కండీషన్లే వర్తిస్తాయి. ఎక్కువ ఫిల్టర్లు ఉన్నాయంటే.. అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. డబ్బు అవసరమే కానీ, పెళ్లి తర్వాత సంతోషం ఈ ఫిల్టర్లకు అతీతంగా ఉంటుంది’ అని వివరించారు.

ఒక వేళ ఇలాంటి కండీషన్లే అబ్బాయివాళ్లు పెట్టి వుంటే ఎలాంటి స్పందనలు వచ్చేవో ఊహించండి అంటూ వేరొకరు కామెంట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios