ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు దేశంలోని నలుమూలల్లోనూ భక్తులు ఉన్నారు. ఆమె దర్శనం కోసం భక్తులు ప్రతి రోజూ వేల సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. అయితే... ఇప్పుడు ఆ భక్తులందరికీ ఊహించని షాక్ తగిలింది. మాత దర్శనాన్ని నిలిపివేశారు.

ఇప్పటి వరకు ఆమె ప్రతిరోజూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించేవారు. అయితే... ప్రస్తుతం కరోనా వైరస్( కోవిడ్-19) అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శనాన్ని నిలిపిస్తున్నట్లు ప్రకటించారు.

Also Read సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ...

మాత దర్శనాన్ని నిలిపివేయాలంటూ ఆరోగ్యశాఖ అధికారులే నోటీసులు జారీ చేయడం గమనార్హం. మళ్లీ అధికారుల నుంచి నోటీసులు అందే వరకు ఈ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. విదేశీయులు కూడా మాత దర్శనానికి వస్తుంటారని.. దీంతో కరోనా భయం ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మాత అమృతానందమయి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కాగా... ఈ వార్తతో మాత భక్తులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.