Pune: పూణేలోని గంగాధామ్ ప్రాంతంలోని ఓ గోడౌన్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గోడౌన్ నుంచి పెద్ద ఎత్తున నల్లటి పొగలు వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం.
Massive Fire Breaks Out In Pune: పూణేలోని గంగాధామ్ ప్రాంతంలోని ఓ గోడౌన్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గోడౌన్ నుంచి పెద్ద ఎత్తున నల్లటి పొగలు వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని పూణే నగరంలోని కొంధ్వా రోడ్ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించి.. బిస్కెట్లు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ సామగ్రితో సహా వివిధ వస్తువులను ఉంచిన దాదాపు 20కి పైగా గోదాములు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. గంగాధామ్ చౌరస్తా సమీపంలో ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 20 గోడౌన్లలో బిస్కెట్లు, సిమెంట్, మౌల్డింగ్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫర్నిచర్, అలంకరణ సామగ్రి ఉంచారు. అయితే, గోడౌన్లలో ఉన్న ఆ వస్తువులన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, అగ్నిమాపక శాఖ వాహనాలు అక్కడి చేరుకున్నాయి. 22 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయనీ, మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
