Bhubaneswar: ఒడిశాలోని కియోంఝర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 200కు పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనీ, తగినంత నీటి సరఫరా లేకపోవడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు పడ్డారని మార్కెట్ కమిటీ అధికారి ఒకరు తెలిపారు.
200 Shops Gutted In Massive Fire In Odisha: ఒడిశాలోని కియోంఝర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 200కు పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనీ, తగినంత నీటి సరఫరా లేకపోవడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు పడ్డారని మార్కెట్ కమిటీ అధికారి ఒకరు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ప్రధాన మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 200కు పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు సోమవారం తెలిపారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాలు వెంటనే తెలియనప్పటికీ షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 200 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
మంటలను ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయని, రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా అని ఓ దుకాణదారుడు తెలిపారు.
