New Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌దికి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. పాత ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలోని వెస్ట్ ఎండ్ సినిమా, 12 టూటీ చౌక్ సమీపంలో పార్క్ చేసిన కార్లు, బైక్‌లతో సహా వాహనాల్లో పెద్ద మంటలు చెలరేగాయి. ద్విచక్ర వాహనాలతో సహా అనేక వాహనాలు దగ్ధమయ్యాయి.

Fire accident: దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌దికి పైగా వాహ‌నాలు దగ్ధమయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ ప్ర‌మాదం కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. వివ‌రాల్లోకెళ్తే.. ఢిల్లీలోని సదర్ బజార్‌లో గురువారం సాయంత్రం దాదాపు పది వాహనాలకు మంటలు అంటుకున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. పాత ఢిల్లీలోని సదర్ బజార్‌లోని వెస్ట్ ఎండ్ సినిమా, 12 టూటీ చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. "అగ్ని ప్ర‌మాదం గురించి సమాచారం అందిన వెంటనే నాలుగు అగ్నిమాపక టెండర్లు అక్క‌డికి చేరుకున్నాయి" అని అగ్నిమాపక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 6:19 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు కాల్ వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు

"ముందుగా కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగినట్లు మాకు స‌మాచారం అందింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై.. మేము సంఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజన్లను పంపించాము. మంటలు ఆర్పివేయబడ్డాయి" అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు గంట సమయం పట్టింది. రాత్రి 8 గంటలకు మంటలు పూర్తిగా ఆరిపోయాయని అధికారి తెలిపారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మ‌రికొన్ని స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

Scroll to load tweet…

కాగా, ఇటీవ‌లి కాలంలో దేశ‌రాధాని ఢిల్లీలో వ‌రుస అగ్నిప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌టంపై స్థానికంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల చాందినీ చౌక్ మార్కెట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 250 దుకాణాలు దగ్ధమయ్యాయి. మంటలను ఆర్పేందుకు 5 రోజుల పాటు అగ్నిమాపక చర్యలు కొనసాగాయి.150కి పైగా అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగాయి.

Scroll to load tweet…

ఇదిలావుండ‌గా, ఓల్డ్ ఢిల్లీలోని కుచా నట్వా ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో బుధవారం మరోసారి మంటలు చెలరేగాయి. ఈ సంఘటన చాందినీ చౌక్‌లో నివేదించబడింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. కుచా నట్వా ప్రాంతంలోని ఓ వెల్డింగ్ షాప్ సమీపంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని రిపోర్టులు పేర్కొన్నాయి.