ఢిల్లీ లజ్‌పత్ నగర్ మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. భారీ మొత్తంలో ఆస్తి నష్టం..
దేశరాజధాని ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ కు చెందిన సెంట్రల్ మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగైదు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కొద్దిసేపటిలో మంటలను అదుపులోకి తెచ్చారు.

దేశరాజధాని ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ కు చెందిన సెంట్రల్ మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ మార్కెట్‌లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయానక వాతావరణం నెలకొంది. అయితే అగ్నిమాపక శాఖకు చెందిన మొత్తం 14 వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
మంటలు దావనంలా వ్యాప్తి చెందడంతో మార్కెట్‌లోని ఐదు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న లజ్‌పత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ అనంతరం అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. అయితే ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణాలు తెలియనున్నాయి.
అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్‌లో సోమవారం సాయంత్రం 4.10 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ తర్వాత నాలుగు అగ్నిమాపక యంత్రాలు అక్కడికక్కడే పంపబడ్డాయి. అయితే పెరుగుతున్న మంటల దృష్ట్యా మొత్తం 14 వాహనాలను 04:50 గంటలకు సంఘటనా స్థలానికి పంపడం ద్వారా 05.40 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు.
ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణంలోని బేస్‌మెంట్ నుంచి రెండో అంతస్తు వరకు మంటలు వ్యాపించడంతో ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి. 41, 42, 43, 9 నంబర్లలోని షాప్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. షాపుల్లో పెద్ద మొత్తంలో బట్టలు ఉంచడంతో మంటలు వేగంగా వ్యాప్తించి.. పై అంతస్తులకు మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పి తరువాత అగ్నిమాపక దళం సిబ్బంది దుకాణాల్లో సోదాలు చేసి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం అందించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఖచ్చితమైన సమాచారం లేదు. ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు.
తప్పిన పెను ప్రమాదం.
లజ్‌పత్ నగర్ మార్కెట్‌కు సోమవారం సెలవు ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదం ఎలా మొదలైందన్న సమాచారం మాత్రం ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.