Asianet News TeluguAsianet News Telugu

నవీ ముంబైలోని డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం.. కొనసాగుతోన్న అగ్నిమాపక చర్యలు 

నవీ ముంబైలోని డంపింగ్ యార్డ్‌లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో పాటు భీకర పొగలు కమ్ముకోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డారు.
 

Massive Fire Breaks Out At Turbhe Dumping Yard In Navi Mumbai, Fire Tenders Rush To Spot
Author
First Published Feb 4, 2023, 5:14 AM IST

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.నవీ ముంబైలోని తుర్భే డంపింగ్ యార్డులో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు పెద్ద ఎత్తున అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రస్తుతం ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. మంటలు చాలా భీకరంగా ఉండడంతో దూరం నుంచి మంటలు, పొగలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఎలా జరిగిందో ఇంకా తెలియరాలేదు. మరోవైపు కళ్యాణ్‌లోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే మంటలు అదుపులోకి వచ్చాయి. .


ధారవిలో భీకర అగ్నిప్రమాదం..మహిళ సజీవ దహనం

బుధవారం తెల్లవారుజామున ముంబైలోని ధారవిలో 5 గార్మెంట్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. కొన్ని నిమిషాల్లోనే ఈ  అగ్నిప్రమాదం చాలా భయంకరంగా మారింది. అనంతరం సమీపంలోని రెండు భవనాలను కూడా చుట్టుముట్టింది. ఈ అగ్నిప్రమాదంలో 62 ఏళ్ల మహిళ మరణించింది. ఓ యూనిట్ గ్రౌండ్ ఫ్లోర్ బాత్రూంలో మహిళ ఇరుక్కుపోయింది. దీంతో  ఉషా లోంధే అనే మహిళ సజీవ దహనమైంది.

ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్‌

మరోవైపు.. కళ్యాణ్ ఈస్ట్‌లోని జన్-కళ్యాణ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా.. మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో ఆస్పత్రి ఆవరణలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో సుమారు 20 మంది రోగులు ఉన్నారు. అయితే మంటలను సకాలంలో నియంత్రించడంతో .. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆసుపత్రి యాజమాన్యం దర్యాప్తు ప్రారంభించింది.
 
ధారవి టెక్స్‌టైల్ లో అగ్నిప్రమాదం..వృద్ధురాలు మృతి

అంతకుముందు ఫిబ్రవరి 1 న.. ధారవిలోని అనేక చిన్న వస్త్రాల తయారీ యూనిట్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 62 ఏళ్ల మహిళ మరణించింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నాలుగు-ఐదు వస్త్రాల తయారీ యూనిట్లలో మంటలు చెలరేగాయి.  వెంటనే రెండు అంతస్తుల రెండు భవనాలకు వ్యాపించాయి. మహిళ యూనిట్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ బాత్‌రూమ్‌లో ఇరుక్కుపోయి, ఆమెను సియోన్‌ ఆస్పత్రికి తరలించగా, ఆమె చనిపోయిందని ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios