న్యూఢిల్లీలోని మాయాపురి ఫేజ్ 1లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోమొబైల్ షోరూం లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని మాయాపురి ఫేజ్ 1 లో గల ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ లో బుధవారంనాడు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నాయి.
ఈ ప్రమాదానికి గల కారణాల గురించి అగ్ని మాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.ఇవాళ ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
also read:హైద్రాబాద్ దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు: ఏడుగురికి గాయాలు
ఇదిలా ఉంటే ఈ నెల 8వ తేదీన ఢిల్లీలోని గులాబీ బాగ్ లో గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రతాప్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని గులాబీ బాగ్ లో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నెల 3వ తేదీన న్యూఢిల్లీలోని గీతా నగర్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా లో అగ్ని ప్రమాదం జరిగింది. అంతకు ముందు రోజు గీతానగర్ లోని స్వీట్స్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరిని పోలీసులు రక్షించారు. వీరిలో ఓ వృద్దురాలితో పాటు మరొకరున్నారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదౌతున్నాయి. వ్యాపార సముదాయాల్లో సరైన ఫైర్ సేఫ్టీ జాగ్రత్తు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణంగా అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలోని హైద్రాబాద్ దోమలగూడలో ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిండివంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 10న హైద్రాబాద్ బాలానగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్ ఐదో ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ నెల రెండో తేదీన సికింద్రాబాద్ ఓ హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నేవీ క్యాంటిన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఏడాది జూన్ 30న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని సాహితీ ఫార్మాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
