ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోహిణి సెక్టార్ 11లో రోడ్డు పక్కనే ఉన్న ఓ పెళ్లి మంటపంలో మంటలు కొన్ని మీటర్ల ఎత్తుతో ఎగసిపడ్డాయి. ఆకాశమంతా దట్టమైన పొగ ఆవరించింది. స్పాట్‌కు 12 ఫైర్ ఇంజిన్లు చేరాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు చెప్పారు. 

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి మంటపంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 11 లో సీఎన్‌జీ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో ఇక్కడ మంటలు చెలరేగాయి. ఆ మంటపం కర్రలతో, పీవోపీలతో చేసి ఉండటంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలకు సంబంధించిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కొన్ని మైళ్ల దూరం ఆకాశంలో దట్టమైన పొగ కనిపిస్తున్నది. ఈ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు ఆ సైట్‌లో ఎవరూ లేరని తెలిసింది. ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనకు ప్రథమ చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు.

మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు అదే సమయంలో ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ వచ్చింది. సుమారు 12 ఫైర్ ఇంజిన్లు స్పాట్‌కు వెళ్లాయి. మధ్యాహ్నం 3.30 గంటల కల్లా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…