చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కోయంబేడు బస్టాండ్ లో ఆదివారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. మంటల్లో బస్సులు దగ్ధమయ్యాయి. బస్సులు మంటలకు దగ్దం కావడంతో ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు.

కోయంబేడు బస్టాండ్ లో పార్క్ చేసిన బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మూడు బస్సలు అగ్నికి ఆహుతయ్యాయి.  ఈ మంటలు వ్యాపించడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ ప్రమాదంలో మూడు బస్సులు దగ్దమైనట్టుగా అధికారులు తెలిపారు. బస్సులకు మంటలు వ్యాపించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. మంటలు ఇతర బస్సులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకొన్నారు.

పక్కపక్కనే బస్సులను పార్క్ చేయడంతో వెంటనే మంటలు ఇతర బస్సులకు కూడ వ్యాప్తి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. ఫైరింజన్లు సకాలంలో వచ్చి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు చెబుతున్నారు. 

గత ఏడాది జూలై 27వ తేదీన ఇదే తరహాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.