దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్‌యూ విద్యార్ధి నేత గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించిన సుమారు 50 మంది వ్యక్తులు క్యాంపస్‌లోకి చొరబడ్డారు.

అనంతరం కర్రలు, రాళ్లతో విద్యార్థులు, ప్రొఫెసర్లతో దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీ వద్దకు చేరుకుని గాయపడ్డ వారిని ఎయిమ్స్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.