Asianet News TeluguAsianet News Telugu

సినీ ఫ‌క్కీలో బ్యాంకులో చోరీ.. 24 కిలోల బంగారం.. రూ.10 లక్షలతో ప‌రార్‌.. 

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని మణప్పురం గోల్డ్ లోన్ బ్యాంక్ బ్రాంచ్‌లో సోమవారం ఉదయం చోరీ జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు ఇరవై నాలుగు కిలోల బంగారం దోచుకెళ్లారు. మొత్తం ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఘటన తర్వాత నగరమంతా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
 

Masked men loot jewellery at gunpoint in Udaipur Manappuram
Author
First Published Aug 29, 2022, 4:20 PM IST

సినీ ఫ‌క్కీలో దొంగలు చెలరేగిపోయారు. పక్కా ప్ర‌ణాళిక‌ ప్రకారం దోచుకుపోయారు. ఒక‌టి కాదు.. రెండు కాదు .. ఏకంగా 24 కిలోల బంగారం.. రూ.10 లక్షల నగదుతో ప‌రారయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉదయ్‌పూర్ జిల్లాలోని ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మణప్పురం లోన్ బ్యాంకును దొంగ‌లు టార్గెట్ చేశారు. సోమవారం ఉదయం 9.30 ప్రాంతంలో ఐదుగురు దుండ‌గులు ముసుగు వేసుకున్నబ్యాంకులో చొరబడ్డారు. రాగానే సిబ్బందిని గన్ తో బెదించారు.  

అంద‌రి ఒక్క చోట కూర్చోబెట్టి.. బ‌య‌టి నుంచి ఎవ‌రూ రాకుండా.. లోప‌లి నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు పోకుండా లాక్ చేశారు. సిబ్బంది సెల్ ఫోన్స్ లాక్కొన్నారు. ఎదురు తిరిగి సిబ్బందిపై దాడి చేశారు. గ‌న్ చూపించి బెదిరించారు. దీంతో సిబ్బంది ప్రాణ భ‌యంతో సైలెంట్ అయ్యారు. అనంతరం లాకర్ తాళాల‌ను లాక్కొని..  సుమారు 24 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బంగారు ఆభరణాలతో పాటు లాక‌ర్ల‌లో ఉన్న‌ సుమారు పదకొండు లక్షల రూపాయల నగదు కూడా దోచుకెళ్లారు. దోపిడీ తరువాత సిబ్బందిని ఓ  తరగతి దిగ్బంధించి.. అక్క‌డి నుంచి ప‌రారయ్యారు.

ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దోపిడీ ఘటన తర్వాత జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేరుకుని.. కేసు న‌మోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నగరంలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

బంగారం విలువ రూ.14 కోట్ల పైమాటే. బంగారంతో పాటు లక్షల రూపాయల నగదు కూడా దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ఈ ఫుటేజీలో గన్ పాయింట్ వద్ద దోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌లో చోరీలు, దొంగతనాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్‌లో ఇద్దరు నగల వ్యాపారులు చోరీకి గురయ్యారు. బ్యాగులో ఆభరణాలు తీసుకెళ్తున్న నగల వ్యాపారి కాల్పులు జరిపి గాయపడ్డాడు. ఆ తర్వాత అలాంటి ఘటనే జరిగింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios