ఓ వ్యక్తి మహిళ లాగా ముస్తాబై.. ముఖానికి మాస్క్ ధరించి.. బ్యూటీ పార్లర్ కి వెళ్లాడు. అక్కడ బ్యూటీ పార్లర్ ఓనర్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ లోని సౌత్ బోపాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. అదే ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది.

కాగా.. ఆదివారం సదరు మహిళ 11గంటలకు పార్లర్ తెరిచింది. కాగా.. ఆమె పార్లర్ లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. సదరు వ్యక్తి అచ్చం మహిళ వస్త్రదారణలో ఉండటం గమనార్హం. గొంతు పురుషుడిలా ఉన్నప్పటికీ.. స్త్రీ దుస్తుల్లో ఉండటంతో.. ఆమె అతనిని ప్రశ్నించలేదు. ఈ క్రమంలో.. ట్రీట్మెంట్ కోసం వచ్చానని  చెబుతూనే.. సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆమె చెయ్యి పట్టుకొని లైంగికంగా వేధించాడు.  దీంతో వెంటనే.. అతనిని బయటకు వెళ్లిపోవాలని ఆమె కోరగా.. అతను వెళ్లకుండా నానా హంగామా చేశాడు. కాగా.. అతి కష్టం మీద అతనిని పార్లర్ నుంచి బయటకు పంపించిన ఆమె ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించింది. కాగా.. సదరు పార్లర్ యజమాని ఫిర్యాదుు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.